యాలకులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ఏలకులు ఇది ఒక సుగంధద్రవ్యం లేక మసాలా దినుసు. ఈ పురాతన సుగంధ ద్రవ్యం దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో పుట్టింది. నేటి ఆధునిక కాలంలో దీని ఉత్పత్తి ఇండో చైనా ప్రాంతం దేశాలు, టాంజానియా, గ్వాటెమాల మరియు శ్రీలంక వంటి దేశాలకు వ్యాపించింది. పురాతనకాలంలో యాలకల్ని పలురకాలుగా ఉపయోగించారు.

Health Benefits of Elaichiయాలకుల్ని ఈజిప్షియన్లు పండ్లను శుభ్రపరిచేందుకు ఉంపయోగించగా, గ్రీకులు మరియు రోమన్లు దీన్నిసుగంధ ద్రవ్యంగా ఉపయోగించేవారు. ఇలా పురాతనకాలంలోనే దీని ఉపయోగాలు పలు విధాలుగా ఉండేవి. కుంకుమపువ్వు మరియు వనిల్లా తరువాత ఏలకికాయ (యాలకలు) అత్యంత ఖరీదైన మసాలా.

Health Benefits of Elaichiనేడు నేపాల్ ఏలకులు, సియామ్ కార్డమమ్ మరియు వింగ్డ్ జావా కార్డమమ్ వంటి తక్కువరకం ప్రత్యామ్నాయాలు యాలకలతో సమానంగా మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, ఎలెట్టేరియా ఏలకుల ఏకైక నిజమైన రూపం, అంటే నిజమైన యాలకలుగా పరిగణించబడుతాయి. భారతదేశంలో మలబార్ ఎడారి యాలకలు మరియు మైసూర్ యాలకులు అని రెండు ప్రధాన రకాలైన యాలకలున్నాయి.

నలుపు, ఆకుపచ్చ రంగుల్లో:

Health Benefits of Elaichiమనం సాధారణంగా ఆకుపచ్చ రంగులోని యాలకులను చూసి ఉంటాం. వీటిని బిర్యానీ లేదా ఏదైనా తీపిగా ఉండే వంటకాల్లో రుచికోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వీటి సువాసన కూడా అమోఘం. వీటితో వంటకాలు తయారు చేస్తే ఘుమఘుమలాడుతాయి.
ఇక నల్ల యాలకులను కూడా చాలా మంది చూసి ఉంటారు. అయితే వీటిని కాస్త తక్కువగా వినయోగిస్తూ ఉంటారు. వీటిని గరం మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తు ఉంటారు. ఈ రెండు రకాల యాలకులలో ఔషధ గుణాలు కూడా బాగానే ఉంటాయి.

బాగా జీర్ణం చేసే లక్షణాలుంటాయి:

Health Benefits of Elaichiమనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను ఎదుర్కొనే లక్షణాలు యాలకుల్లో ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యం యాలకులకు ఎక్కువగా ఉంటుంది.

గుండెకు చాలా మంచివి:

Health Benefits of Elaichiయాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

డిప్రెషన్ నుంచి ఉపశమనం:

Health Benefits of Elaichiమీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతోగానూ ఉపయోగపడుతాయి. ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. యాలకులు డిప్రెషన్ విషయంలో తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది.

ఆస్తమాను తగ్గించుకోవొచ్చు:

Health Benefits of Elaichiఆస్తమాను కాస్త అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి.

డయాబెటిస్ రాకుండా చేస్తుంది:

Health Benefits of Elaichiడయాబెటిస్ ను యాలకులు కొంత మేరకు అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

Health Benefits of Elaichiయాలకుల్లోని రసాయనాలు నోటిలోని బాక్టీరియంపై చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలితే మంచి ఫలితం ఉంటుంది. యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లోఇన్ఫెక్షన్స్ రావు.
మీ నోటి నుంచి వాసన కూడా రాదు.

ఆకలి బాగా వేస్తుంది:

Health Benefits of Elaichiకొందరికి ఆకలి సరిగ్గా వేయదు. దీంతో తినాలని ఉన్నా తినలేకపోతుంటారు. ఆకలి కాకపోవడం అనేది చాలా వ్యాధులకు కారణం అవుతుంది. క్యాన్సర్, అనోరెక్సియా వంటి వాటి బారిన కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు యాలకులను తింటూ ఉండడం మంచిది. దీంతో మీకు ఆకలి బాగా వేసే అవకాశం ఉంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR