ఆడవారికి ఇష్టమైనవి ఏమిటి? అనే ప్రశ్న వస్తే ఎవ్వరైనా ముందుగా చెప్పేది నగలు. అవును ఇది జెగమెరిగిన సత్యం ఎవ్వరు కాదనలేరు. ఆభరణలో చాల రకాలు ఉంటాయి ధరించిన దుస్తులకు సరిపోయేవిధంగా నగలు వేసుకోవడం కొంతమంది ఆడవారి ప్రత్యేకత. అయితే దుస్తులకు మాత్రమే కాదు పూర్వ కాలంలో రోజులకి తగిన నగలు ధరించేవారు. ఏడురోజులకి ఏడు వారాలనగలు. ఏడు రోజులు ఏడుగ్రహాలకు సంకేతంగా గ్రహాలకు శాంతి కలిగేలా ధరించేవారు.
ఏ రోజున ఏయే నగలు ధరించలో తెలుసుకుందాం.
సోమవారము:
చంద్రునికోసము ముత్యాలహారాలు, గాజులు మొదలగునవి.
మంగళవారము:
కుజునికోసము పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.
బుధవారము:
బుధునికోసము పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
గురువారము:
బౄహస్పతికోసము పుష్యరాగము కమ్ములు ఉంగరాలు మొదలగునవి
శుక్రవారము:
శుక్రుని కోసము వజ్రాల హారాలు ముక్కుపుడక మొదలగునవి.
శనివారము:
శనికోసము నీలమణి మణిహారాలు మొదలగునవి.
ఇలా గ్రహాలకు ఇష్టమైన కెంపులతో ముత్యాలతో వజ్రాలతో… నగలు తయారు చేయించి ధరించటమే ఏడువారాల నగలకు అర్ధం.