కడుపు నొప్పికి తక్షణ ఉపశమనం కోసం ఇవి తప్పక పాటించండి

కడుపునొప్పి’ అనేది విస్తారమైన పదం. సాధారణంగా పొత్తికడుపు ఛాతీకి, తొడగజ్జకు మధ్యలో భాగంలో వచ్చే నొప్పిని ‘కడుపునొప్పి’ గా సూచిస్తాం. పొత్తికడుపు అనేది కడుపు, నీరు తిత్తి (ప్యాంక్రియాస్), పిత్తాశయం, పేగు, ప్రత్యుత్పత్తి అవయవాలు (లేదా లైంగిక అవయవాలు), మూత్రాశయనాడి వంటి అనేక అవయవాలను కలిగి ఉంటుంది. అందువల్ల కడుపు నొప్పి కడుపులోని ఏ భాగానికైనా గాయం, సంక్రమణం లేదా పుండు, వాపు ఏర్పడడం మూలాన సంభవించవచ్చు.

Tips for immediate relief of abdominal painమనలో అందరూ, ఏదో ఒక సమయంలో, కడుపు నొప్పికి లోనయ్యే ఉంటాం. ఇది చాలా సాధారణమైన రుగ్మతే. సాధారణంగా కడుపు నొప్పి స్వల్పకాలికమైనదే కానీ తీవ్రమైనదేమీ కాదు. అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన పరిస్థితిని తెచ్చిపెడుతుంది.కడుపునొప్పికి చికిత్స సాధారణంగా ఆ నొప్పి తీవ్రత, ఆ నొప్పికి దారి తీసిన కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా మందులు, ద్రవం భర్తీ, విశ్రాంతితో పాటు స్వీయ సంరక్షణతోనే నయమవుతుంది. చాలా సార్లు అజీర్ణం, అతి సారం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇది ఏర్పడుతుంది.

చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే, శస్త్రచికిత్స అవసరం కలుగుతుంది. అయితే నొప్పి తీవ్రత మనకు ఇబ్బందిగా ఉన్నపుడు తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం…

పుదీనా:

Tips for immediate relief of abdominal painపొట్టనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో పుదీనా ఒక మంచి హోం రెమడీ. సాధారణంగా కొన్ని పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకొని నమిలి మ్రింగాలి . లేదా పుదీనా ఆకులను వేసి టీ తయారుచేసుకొని త్రాగితో కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

అలోవెరా జ్యూస్:

Tips for immediate relief of abdominal painఅలోవెరా ఆరోగ్యపరంగా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలోవెరాలో అనేక ఔషధ గుణ గణాలున్నాయి. ఇది క్రిములతో పోరాడుతుంది. కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన పొట్ట, ప్రేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, కడుపులో తిమ్మెర్లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

లెమన్ వాటర్:

Tips for immediate relief of abdominal painలెమన్ జ్యూస్, గోరువెచ్చని నీటి కాంబినేషన్ తో తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం పిండి, కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బేకింగ్ సోడా:

Tips for immediate relief of abdominal painఆల్కా సెట్జర్ వంటిదే బేకింగ్ సోడా, ఇది హార్ట్ బర్న్ ను మరియు అజీర్తిని నివారిస్తుంది. కడుపు నొప్పిని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి త్రాగడం వల్ల వెంటనే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం:

Tips for immediate relief of abdominal painఅల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. మరియు ఇతర కొన్ని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల కూడా అజీర్తి వంటి లక్షణాలను తగ్గించి కడుపు నొప్పిని నివారిస్తుంది. అల్లం ఎండిన దానికంటే, తాజాగా ఉన్నది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తాజాగా ఉండే అల్లంను టీ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

హీట్ ప్యాడ్స్ లేదా గోరువెచ్చని బియ్యం:

Tips for immediate relief of abdominal painకడుపు నొప్పిగా ఉన్న ప్రదేశంలో కొద్దిగా వేడి కలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చ. హీట్ ప్యాడ్ మీ వద్ద లేకపోయినట్లైతే కాటన్ వస్త్రం మరియు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యంను పాన్ లో వేసి బాగా వేడి చేసి ఆ బియ్యంను కాటన్ క్లాత్ లో వేసి, నోటితో గాలిని ఊపుతూ నొప్పి ఉన్న ప్రదేశంలో వెచ్చవెచ్చగా వేడి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR