అరిటాకులో భోజనం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్నిఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. శత్రువైన సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Health Benefits of Eating in Aritakuవెంటనే జీర్ణం అవుతుంది :

అరటి ఆకులో అన్నం తింటే అది వెంటనే జీర్ణం అవుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. కూల్ గా ఉండగలుగుతారు.మీకు బాగా ఆకలి వేసేందుకు కూడా అరటి ఆకు ఉపయోగపడుతుంది. మీ శరీరానికి ఎన్నో రకాల మేలును అరటి ఆకు చేకూరుస్తుంది.

పేగుల్లోని క్రిములు చనిపోతాయి :

అరటి ఆకుల్లో అన్నం తింటే పేగుల్లోని క్రిములు చనిపోతాయి. పూర్వం పగవారికి ఇంటికి వెళ్లినప్పుడు వారు అరటి ఆకులోనే భోజనం పెట్టించుకుని తినేవారు. పాత కక్షలను మనస్సులోని పెట్టుకుని తాము తినే ఆహారంలో ఎక్కడ విషం కలుపుతారోనని వారి భయం.

Health Benefits of Eating in Aritakuనల్లగా మారిపోతుంది :

విషం కలిపిన అన్నాన్ని అరటి ఆకులో వడ్డిస్తే ఆ ఆకు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. దీంతో అన్నంలో విషం కలిసిందని తెలుస్తుంది. అందుకే పగోడి ఇంట్లో కూడా అరటి ఆకులో ఏ భయం లేకుండా భోజనం చేస్తారు.

Health Benefits of Eating in Aritakuఅన్నంలో కలిసిపోతుంది :

ఇక వేడిగా ఉండే ఆహారాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది. ఇది అన్నానికి ఒకరకమైన రుచిని ఇస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది :

Health Benefits of Eating in Aritakuరోగ నిరోధక శక్తి పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది. అంతేకాదు ప్లాస్టిక్ ప్లేట్లోలో కాకుండా అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు. అరటి ఆకులలో ఇతరులకు భోజనం పెడితే వారిపై మనకు ఎంతో గౌరవం ఉన్నట్లు అర్థం.

దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం :

అరటి ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల చాలా రకాల దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల తగ్గిపోతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR