నైట్ మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది పనివాళ్ళకి ఇవ్వడమో లేదా చెత్తలో వేయడమో చేస్తారు కానీ పొద్దున ఆ అన్నాన్ని తినడానికి ఆసక్తి చూపరు. మనం అలా తినకుండా వదిలేసే చద్దన్నంలో మన శరీరానికి ఉపయోగపడే చాలా రకాల పదార్థాలు ఉంటాయని పరిశోధనలో తెలిసింది. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి, మన తాతల కాలంలో అయితే రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగుని కలుపుకొని తినేవారు అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.
అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల దానిలో చాలా రకాల మార్పులు జరుగుతాయి, ఉదాహరణకు 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి. మరిన్ని ప్రయోజనాలు చూద్దాం.
శక్తిని ఇస్తుంది :
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చద్దన్నంను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల శరీరం లైట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
స్లిమ్ గా ఉండటానికి :
రాత్రంతా ఫెర్మినేట్ చేసిన రైస్ లో.. తాజాగా వండిన అన్నంతో పోల్చితే.. 60శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఈ రైస్ తినడం వల్ల.. స్లిమ్ గా ఉండటానికి సహాయపడుతుంది.
మినరల్స్ :
చద్ది అన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్.. ఐరన్, పొటాషియం, క్యాల్షియంగా మారుతుంది. అది కూడా వేల శాతంలో పెరుగుతుంది.
బి 12 :
ముందురోజు వండిన అన్నంను ఉదయం తీసుకోవడం వల్ల.. అన్నంలో.. ఆహారం ద్వారా చాలా అరుదుగా లభించే విటమిన్ బి6, బి12ను తేలికగా పొందవచ్చు.
మంచి బ్యాక్టీరియా :
ఈ అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే అనేక వ్యాధులతో పోరాడటానికి ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది.
ఎముకలకు :
ఇలా మిగిలిపోయిన చద్ది అన్నం తినడం వల్ల.. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావు. అలాగే కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి.
పొట్ట సమస్యలు :
ఉదయాన్నే ఈ రైస్ తీసుకోవడం వల్ల.. పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. శరీరానికి హాని చేసే.. బాడీ హీట్ కూడా తగ్గి.. చల్లదనాన్ని ఇస్తుంది.
కాన్ట్సిపేషన్ :
ఈ చద్ది అన్నంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. కాన్ట్సిపేషన్ సమస్య దూరం అవుతుంది.
బ్లడ్ ప్రెజర్ :
చద్ది అన్నంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది.
రోజంతా ఉల్లాసం :
ఈ అన్నం ఉదయాన్నె తీసుకోవడం వల్ల.. అలసట సమస్య దరిచేరదు. దీనివల్ల రోజంతా.. చాలా ఫ్రెష్ గా, ఉత్సాహంగా ఉంటారు.
చర్మ సమస్యలు :
చద్ది అన్నంలో ఉండే పోషకాలు.. చర్మ సమస్యలు, ఎలర్జీలు, ఎగ్జిమా, దురద వంటి వాటిని దూరంగా ఉంచుతుంది.
అల్సర్స్ :
పొట్టలో అల్సర్స్ మాత్రమే కాదు.. ఇతర అన్ని రకాల అల్సర్లకు దూరంగా ఉండాలంటే.. చద్ది అన్నంను రెగ్యులర్ గా తీసుకోవాలి.
యవ్వనంగా ఉంటారు :
ప్రతి రోజూ ఈ అన్నంను తీసుకుంటే.. మీరు యవ్వనపు సౌందర్యంతో మెరిసిపోతారు. యూత్ ఫుల్ అండ్ రేడియంట్ లుక్ ని మెయింటెయిన్ చేయవచ్చు.