ఈ ఆలయంలో ఉండే ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

0
2284

తమిళనాడులో కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం త్యాగరాజస్వామి ఆలయం. తమిళనాడులోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబికల గురించి కూడా విశేషంగా పేర్కొన్నాయి.

త్యాగరాజస్వామి ఆలయంపురాణ గాథాల ప్రకారం ఒక సారి రాక్షసులకు మరియు ఇంద్రునికి మధ్య యుద్దం సంభవించింది. ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేశాడట. అందుకు ప్రతి ఫలంగా ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమాస్కంద మూర్తిని కావాలని కోరుతాడు. సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తర్వాత దాన్ని ఇంద్రునికి ఇస్తాడు.

త్యాగరాజస్వామి ఆలయంఅయితే ఆ విగ్రహాన్ని ముచికుందుడుకు ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారుచేయిస్తాడు. అయితే ముచికుంద శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమాస్కంద మూర్తిని ముచికుందకు ఇవ్వక తప్పలేదు. అలా పొంది పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్ లో ప్రతిష్టించాడు. ఈ మూర్తినే వీధి విడంగర్ అని పిలుస్తుంటారు.

త్యాగరాజస్వామి ఆలయంశ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు, ఎనభూ విమానములు, పదమూడు మంటపాలు, పదిహేను పవిత్ర బావులు, మూడు పూలతోటలు, మూడు పెద్ద ప్రాకారాలు, వెయ్యికి పైగా ఉపాలయాలతో ఆ ఆలయం ఎంతో విశాల ప్రాంగణంలో కొలువుదీరి ఉంది.

త్యాగరాజస్వామి ఆలయంఈ ఆలయంలో అమ్మవారు కమలాంబికా అమ్మవారు కాలుపై కాలు వేసుకుని ఠీవిగా కూర్చొని ఉంటడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటువంటి భంగిమలో అమ్మవారు మనకి మరెక్కడా కనబడరు. ఈ స్థితిలో కూర్చుని అమ్మవారు శివుని ధ్యానిస్తూ ఉంటారని, కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు.

త్యాగరాజస్వామి ఆలయంవాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలసిన స్వామి అని దేవతల ప్రార్థననుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు. అనంతీశ్వరుడు, నీలోత్పలాంబ, అసలేశ్వరుడు, అడగేశ్వరుడు, వరుణేశ్వరుడు, అన్నామలేశ్వరుడు మొదలైన ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు.

నంది ప్రత్యేకత:

త్యాగరాజస్వామి ఆలయంఇతర శివాలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడి నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది.

దేశంలోని అతి పెద్ద కోనేరు :

త్యాగరాజస్వామి ఆలయంఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు. ఇది అతి విశాలమైన సుందరమైనదిగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి విష్ణువును వివాహమాడాలని ఇక్కడి మూలస్థానేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసింది. అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది. ఈ కోనేరు ఆలయమంత పెద్దది, ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ది చెందినది. కొలను మధ్యలో నాదువన నాథుని ఆలయం కూడా ఉంటుంది.

గుప్తనిధుల రహస్యం :

త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో గుప్తనిధులున్నట్లు శిలాఫలకాలు వెల్లడిస్తున్నాయి.

అత్యంత విశిష్టత ఉన్న రథం:

త్యాగరాజస్వామి ఆలయంచారిత్రాత్మిక త్యాగరాజస్వామి ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ రథం. దీనిని రూ.2.17 కోట్ల వ్యయంతో రూపొందించించారు.

తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు. అతని కుమారుడు రథంలో వస్తుండగా ఒక దూడ అతని రథానికి అడ్డు పడి మరణిస్తుంది. రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరిన ఆవుకు అభయం ఇచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి ఆ రాజకుమారుని కూడా రథచక్రాల క్రింద చంపవలసిందిగా శిక్షను ఖరారు చేసి అమలు పరుస్తాడు. ఆ రాజు దర్శనిరతికి ప్రీతి చెందిన యముడు తన స్వరూపంతో ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్తాడు. దీనికి గుర్తుగా ఇప్పటికీ రాతి రథంపై ఈ గాథ అంతా కళ్ళకు కట్టినట్లు చెక్కి ఉండటం దర్శనమిస్తుంది.