ముఖంపై పేరుకున్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

సాధారణంగా ముఖంపై గడ్డం, చెంపలు, కనుబొమ్మలు, దవడలు, మెడ చుట్టూ కొవ్వు నెమ్మదిగా పేరుకోవడం ప్రారంభిస్తుంది. రోజులు గడిచే కొద్దీ ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇలా జరిగితే ముఖంపై కొవ్వు ఉన్నట్టే. అసలు ఈ ఫేస్ ఫ్యాట్ ను ఎందుకు తగ్గించుకోవాలి అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది.. ముఖంపై కొవ్వు పెరగడమంటే ఒబేసిటీ సమస్య వచ్చే అవకాశం ఉందని అర్థం. ఎందుకంటే శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా ముందు అది కనిపించేది ముఖంలోనే కాబట్టి.

Tips for reduce fat on the faceఇక ఫేస్ ఫ్యాట్ తొలగించుకోవడానికి రెండో కారణం, మంచి అప్పియరెన్స్ కోసం. మనం ఎంత రెడీ అయినా ముఖం అందంగా లేకపోతే ఏంటి ఉపయోగం. నిజానికి ఫేస్ ఫ్యాట్ రావడానికి చాలా కారణాలుండొచ్చు. ముఖ్యంగా జన్యువులు, హార్మోన్లు, పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్ ఫేస్ ఫ్యాట్ పెరగడానికి కారణం కావచ్చు.

Tips for reduce fat on the faceకారణాలైతే తెలుసుకున్నాం కానీ అసలు ఇలా ముఖంపై పేరుకున్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి? దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తరుచూ చేసే ఎక్సర్సైజులతో పాటు మేము చెప్పే ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

పసుపు:

Tips for reduce fat on the faceఇంటి చిట్కాలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది పసుపు. సౌందర్యం నుంచి ఆరోగ్యం వరకు మనకెదురైన చాలా సమస్యలకు పసుపు పరిష్కారం చూపిస్తుంది. ముఖం మీద పేరుకున్న కొవ్వును తొలగించే విషయంలోనూ పసుపు పనికొస్తుంది. గిన్నెలో శెనగపిండి, పెరుగు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై చేరిన కొవ్వు తగ్గడంతో పాటు.. చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. అంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

పాలు:

Tips for reduce fat on the faceడబుల్ చిన్ ఉందంటే ఫేస్ ప్యాట్ ఉన్నట్టే. దాన్ని తగ్గించుకోవడానికి పాలను ఉపయోగించవచ్చు. కొద్దిగా పచ్చిపాలను తీసుకుని ముఖం, మెడకు రాసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను పాటించడం ద్వారా డబుల్ చిన్ పోగొట్టుకోవచ్చు.

నిమ్మరసం:

Tips for reduce fat on the faceప్రతి రోజూ ఉదయాన్నే.. ఖాళీ కడుపుతో వేడినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు సైతం ఈ చిట్కాను పాటిస్తుంటారు. ఈ చిట్కా ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నేనిమ్మరసం, తేనె కలిపిన వేడి నీరు తాగడానికి ప్రయత్నించండి.

కర్భూజ:

Tips for reduce fat on the faceకర్భూజలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫేస్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అలాగే శరరీంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది కాబట్టి.. ఆరోగ్యమూ మెరుగు పడుతుంది. రోజూ ఒక గ్లాసు కర్భూజ రసం తాగడం వల్ల ముఖంపై పేరుకున్న కొవ్వు కరిగించుకోవచ్చు.

డార్క్ చాక్లెట్:

Tips for reduce fat on the faceసాధారణంగా చాక్లెట్ తింటే బరువు పెరిగిపోతామని భావిస్తుంటారు. కానీ డార్క్ చాక్లెట్ మాత్రం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనిలో కొకోవా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR