పల్లీలు.. మన ఆహారంలో ఓ భాగమైపోయింది. వీటిని ఉడకబెట్టి వేయించుకుని, పచ్చడి, కూరలు చేసుకుని తినొచ్చు. ఉదయం టిఫిన్స్‌లో వేరుశనగపప్పుని చట్నీల్లా చేసుకుని తింటారు. మరికొందరు పల్లీ చెక్క రూపంలో బెల్లంతో తీసుకుంటారు. వీటిని తినడం వల్ల విటమిన్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కూడా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
వీటిని పల్లికాయ, వేరుశనగ, మట్టి శనగ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఎక్కడ ఎవరు ఎలా పిలిచినా అవి అందించే పోషకాలు పుష్కలం. అయితే ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అనే భయంతో చాలా మంది వీటిని తినరు. కానీ మితంగా తింటే రోజూ తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ఆలోచన శక్తి పెరుగుతుంది..
మీ మైండ్ చురుగ్గా పని చేస్తుంది…ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి.
రోజూ కొన్ని వేరుశెనగ పల్లీలు తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా వేరుశెనగలు సహాయపడతాయి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ఇందులో విటమిన్ ఇ, విటమిన్ బి తో పాటు క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, జింక్, బోరాన్ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఆనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు.
ఇక వేయించినవి కాకుండా ఉడికించినవి తింటే పీచు పదార్దం ఎక్కువగా అందుతుంది. వేరుశనగలోని ఇనుము రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. పల్లీలతో పాటు దీని నుంచి తీసిన నూనె కూడా చాలా మంచిదంటున్నారు నిపుణులు.
వేరుశెనగను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల పాలీఫెనాల్స్ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి అంటున్నారు. వేరుశనగలో ప్రోటీన్స్,యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లలో సరైన ఎదుగుదలకు సహయపడుతుంది. ఫోలిక్,యాంటి ఆక్సిడెంట్లు కడుపులో వచ్చే క్యానర్స్, ప్రేగు క్యాన్సర్ ను నివారిస్తాయి.