తెలుగు లోగిళ్ళు షడ్రుచులతో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి. పూజానంతరం పెద్దల ఆశీస్సులను పొందడం, దేవాలయ సందర్శనం చేస్తే పుణ్యఫలాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగగా పరిగణిస్తారు.
ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరాముని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు.
అలాంటి ఉగాది పండుగ రోజున శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.
ఇంకా శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.