పిస్తా తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పిస్తాలో పోషక పదార్థం ఎక్కువ. ఆంటీ-ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి. రక్తంలో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి. పిస్తా తక్కువ తిన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది. పొట్ట పెరగనీయదు. ఏం తింటే మన శరీరానికి తక్కువ కేలరీలతో తక్షణశక్తి సమకూరుతుందో దాని పేరే ‘పిస్తా’.

benefits of eating pistachiosఒక ఔన్సు పిస్తా తింటే మన శరీరానికి160 కేలరీల శక్తి సమకూరుతుంది. 30గ్రాముల పిస్తాకు 87 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది. ఇందులో మిగతా నట్స్‌కన్నా ఎక్కువ ప్రోటీన్‌శాతం ఉంది. ఇందులో ఫైబర్ కూడా‌ ఎక్కువే. దాంతోపాటూ చర్మానికి మేలు చేస్తానంటూ విటమిన్‌ ఇ సైతం ఉంది. మరి అలాంటి పిస్తాను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చా అనేది చూద్దాం.

benefits of eating pistachiosడయాబెటిస్ డైట్‌లో పిస్తా చేర్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతర గింజలతో పోల్చితే పిస్తాపప్పులు కేలరీలు మరియు కొవ్వులు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, రోజుకు కొన్ని కేలరీలతో పోషకపదార్థాలు పొందడానికి ఇవి సహాయపడతాయి.

benefits of eating pistachiosమ‌న జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియా అనేక ప‌నులు చేస్తుంది. అది మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఫైబ‌ర్‌ను షార్ట్ – చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్‌గా మారుస్తుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు రావు. అయితే పిస్తాప‌ప్పును నిత్యం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

benefits of eating pistachiosపిస్తా ప‌ప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం కొలెస్ట్రాల్‌, బీపీల‌ను త‌గ్గిస్తాయి. నిత్యం గుప్పెడు మోతాదులో 4 వారాల పాటు పిస్తాప‌ప్పును తిన్న వారిలో 23 శాతం వ‌ర‌కు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. అందువ‌ల్ల డయాబెటిస్ ఉన్నవారు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు షుగర్ ని అదుపులో ఉంచుతుంది.

benefits of eating pistachiosపిస్తాప‌ప్పులో ఎల్‌-అర్గైనైన్ అన‌బ‌డే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శ‌రీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ర‌క్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. షుగర్ పేషెంట్స్ నిత్యం రెండు గుప్పెళ్ల మోతాదులో 12 వారాల పాటు పిస్తాప‌ప్పును తింటే ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు 20 నుంచి 30 శాతం వ‌ర‌కు త‌గ్గాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువల్ల డ‌యాబెటిస్ ఉన్న వారు వీటిని నిత్యం తింటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR