కరోనా సెకండ్ వేవ్ లో ఇంటి చిట్కాలతో ఇమ్యూనిటీని పెంచుకుందాం

కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్‌ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తో ఈ మహమ్మారి భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాక్సిన్ వచ్చినా సరే కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు తేల్చి చెప్పారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.

Let’s boost immunity with home tips in Corona Second Waveఅదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మరో ముఖ్యమైన విషయం. ఈ మహమ్మారి బారిన పడినా సరే మనల్ని మనం కాపాడుకునేలా రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటీ పవర్‌) పెంచుకొనేందుకు ప్రభుత్వాలు పలు కీలక సూచనలు చేశాయి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం అవసరం.

Let’s boost immunity with home tips in Corona Second Waveఅది సరిగా.. పనిచేసినప్పుడు మాత్రమే ఎటువంటి వైరస్ వచ్చినా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేల రోగనిరోధిక శక్తి సరిగా పనిచేయకపోతే శరీరంలోకి బాక్టీరియా, ఫంగస్, వైరస్ లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి.

వీటన్నింటిని బయటకు పంపిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిచడానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా.. స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే రోగనిరోధిక శక్తి ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇవి వంటగదిలో సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం..

వెల్లుల్లి :

boost immunity with home tips in Corona Second Waveవ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రుచికరమైన ఆహారంలో జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్‌కు కారణమయ్యే బ్యాక్టిరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరి చేరనివ్వదు.

అల్లం:

boost immunity with home tips in Corona Second Waveమనం నిత్యం మన కూరల్లో ఉపయోగించే వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గొంతును ఉపశమనం చేస్తుంది, మరియు ఛాతీ రద్దీని తగ్గిస్తుంది. అల్లం మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అయితే అల్లాన్ని నిత్యం పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

తేనె :

boost immunity with home tips in Corona Second Waveతేనె కలిగి ఉన్న ఔషధ గుణాలను ఎంత వివరించిన తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉన్నాయి, ఇవి క్రిమినాశక మందులుగా తయారవుతాయి మరియు కాలానుగుణ అలెర్జీల నుండి ఉపశమనం అందిస్తాయి.

నల్ల మిరియాలు :

boost immunity with home tips in Corona Second Waveనల్ల మిరియాలను కాలి మిర్చ్ అని పిలుస్తారు. అయితే నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

పసుపు :

boost immunity with home tips in Corona Second Waveపసుపు ఒక సాధారణ వంటింటి పదార్థం. పసుపుని మనం వంటకాలకు కాక , దెబ్బలకు రాస్తారు. పసుపు ఏంతో మేలు చేస్తుంది. పసుపు యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని చెపుతారు. మరియు ఇది వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది.

నిమ్మ :

boost immunity with home tips in Corona Second Waveఅనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి చాలా అవసరం. అంతేకాదు.. వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్ సి చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్ అద్భుతాలు చేస్తుంది. ఇది తప్పనిసరిగా యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక శక్తిని కలిగి ఉంటుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR