వినాయకుడు పాములను ఆభరణాలుగా ఎందుకు ధరిస్తాడు?

ఇంద్రుని కుమార్తె దేవసేనతో కుమారస్వామి కళ్యాణం నిశ్చయమైంది. తమ్ముడికి వివాహం నిశ్చయమైంది నీ వివాహం చేస్తే తప్ప తమ్ముడికి చేయలేము. అందుకే నువ్వు వివాహం చేసుకోవాలి అని పార్వతి చెప్పింది. కానీ వివాహం ఇష్టం లేని ఏకదంతుడు అనేక సాకులు చెబుతాడు. కానీ పార్వతి దేవి మాత్రం పట్టుబడుతుంది. ఇక చేసేది లేక నేను తపస్సుకి వెళుతున్నాను అని చెప్పి వెళతాడు.

Indhruduఅలా వెళ్లి విఘ్నేశ్వరుడు ఒకచోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాముల పుట్టల మయంగా ఉంది. చుట్టూ వలయంగా పుట్టలున్న ప్రదేశం చూసుకొని తపస్సు మొదలుపెట్టాడు. పుట్టల్లోంచి పాములు నిటారుగా లేచి పడగలు విప్పి బుసలుకొడుతూ కాపలాకాసాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు, ‘‘మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందర్నీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు. పగతీర్చుకోండి!” అని చెప్పి ఉసిగొల్పాడు.

Ganeshaరాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. చచ్చినవాళ్ళు చావగా మిగిలివాళ్ళు తమ తెలివి తక్కువ తనాన్ని నిందించుకుంటూ ఇంద్రుణ్ణి తిడుతూ భయంతో అక్కడి నుంచి పారి పోయారు.

Ganeshaఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతాపురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ, ‘‘విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలాగ మీ ప్రతాపం చూపండి!” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు. దేవతలు అప్సరసలతో జంటజంటలుగా సుర సేవిస్తూ కోలాహలం చేస్తూ పాటలు మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్ళను చుట్టుకొని కోరలతో కాట్లు వేసాయి.

Ganeshaఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని ఝళిపించాడు. నాగుల కోపం రెచ్చిపోయింది. నాగలోకం నుంచి బిలబిలమని మహాసర్పాలన్నీ వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకూ, నాగులకూ చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్నే లక్ష్యపెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పుట్టించి మరీ వెళ్లాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయానికి సంతోషించి పాములను ఎత్తుకొని ముద్దాడి, అలంకారాల్లాగ మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు.

Ganeshaపార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. ‘‘అమ్మా! తండ్రి సొత్తు తనయుడికి సంక్ర మించడం సహజమైందే కదా! శంకరాభరణాలు నాకూ భూషణాలే! అదీగాక పాములు నాకు ప్రాణమిత్రులై ప్రాణాలకు తెగించి కాపు కాసాయి. ఆప్తమిత్రుల అండదండలే కదా నిజమైన దండకడియాలు, అమూల్యాభరణాలు అందుకే నాగభూషణ అనిపించు కున్నాను!” అని విఘ్నేశ్వరుడు ఆనందంతో చెప్పాడు. శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్టకు విసుక్కుంది. ఆ విధంగా వినాయకుడు నాగభూషణుడు అయ్యాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR