రోజుకు ఎక్కువ సేపు నిద్ర పోయేవారు డిప్రెషన్ బారిన పడతారా ?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తిండి, నీరు, ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి. సరిపోయేంత నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రంతా మేల్కొని నాలుగైదు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేయలేరు. రాత్రుల్లో నిద్రపోకుండా మేల్కొన్నట్లైతే.. ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు.

Problems caused by sleeping too long!అయితే కొంత మంది అనావృష్టిలా కావాల్సిన నిద్ర కూడా పోకపోతే మరికొంత మంది మాత్రం అతివృష్టిలా రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రకు కేటాయిస్తున్నారు. ఏకాస్త సమయం దొరికినా చాలు నిద్రపోతారు. అయితే ఎక్కువ సమయం నిద్రపోవడం మంచిది కాదని వైద్య పరిశోధనల్లో తేలింది. ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు.

Health Benfits of Ajwainరోజుకు ఎక్కువ సేపు నిద్ర పోయేవారు డిప్రెషన్ బారినపడతారు. అలాగే మెదడులోని కణాలు బలహీనం అయిపోతాయి. గర్భధారణ సమస్యలు ఎదురవ్వొచ్చు. గుండె ధమనులు దెబ్బతింటాయి. షుగర్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలా ఎన్నో రకాల సమస్యలకు కారణం అతినిద్ర అని చెప్పవచ్చు.

Problems caused by sleeping too long!అయితే అసలు మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి? అనేది వారి శారీరక, మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ మనిషికి సగటు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. అదే అనారోగ్యం బారిన పడినప్పుడు, దీర్ఘకాల రోగాలు వేధిస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది.

Problems caused by sleeping too long!అంటే ఒక సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజుకు 7 – 8 గంటలకు తక్కువ, 9 గంటల కంటే ఎక్కువ నిద్ర పోకూడదు. కాబట్టి మీ నిద్ర సమయం కేవలం 7 నుంచి 8 గంటలు మాత్రమే ఉండేలా చూసుకోవడం ఉత్తమం. అలాగే అదేపనిగా అస్తవ్యస్తంగా నిద్రపోవడం వల్ల చర్మం మీద ముడతలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా త్వరగా ముసలివారు అవుతున్నట్టు కనిపిస్తారు. వెల్లకిలా పడుకుని చేతులు తిన్నగా ఉంచి నిద్రపోవడం మంచిదని తెలిపారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR