నల్లనువ్వుల్లో పోషకాలు మెండు. అందుకే వీటిని ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు. నువ్వులతో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్నిస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో బోలెడన్నీ పోషకాలు ఉన్నాయని అవి శరీరానికి చాలా మేలు చేస్తాయని అంటున్నారు. నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రక్తహీనత సమస్యతో బాదపడేవారు, నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది. ఆ రెండింటిలోనూ ఇనుము ఎక్కువగానే ఉంటుంది. కొన్ని పరిశోధన ప్రకారం, రెగ్యులర్ డైట్ లో నువ్వులను చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో ప్యాంక్రియాటిక్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. నల్ల నువ్వుల్లో యాంటీ కాన్విల్సివ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల , ఇవి కొన్ని రకాల అనారోగ్యాలను నివారిస్తుంది.
రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం, నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది. అలాగే ట్యూమర్(క్యాన్సర్ కణాలు )ఏర్పడకుండా నివారిస్తుంది. వాస్తవానికి, నల్ల నువ్వుల్లో క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ లో ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తాయి. దాంతో బ్రెయిన్ క్యాన్సర్ సమస్య ఉండదు .
నల్ల నువ్వుల్లో ఉండే ఆప్టోప్టోసిన్ సెల్స్ లుకేమియాకు గురికాకుండా చేస్తుంది. నల్ల నువ్వుల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ హార్ట్ మరియు కార్డియో వాస్కులర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారు డాక్టర్ సలహా ప్రకారం ఉపయోగించాల్సి ఉంటుంది. నల్ల నువ్వులు తలనొప్పిని నివారించడంలో సహాపడుతాయి. కాబట్టి, దీన్ని తలకు మరియు ఫోర్ హెడ్ కు అప్లై చేయడం వల్ల, తలకు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
నల్ల నువ్వుల్లో వ్యాధినిరోధకత పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వీటిని తినడానికి ముందు డాక్టర్ ను సంప్రదించి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు . నల్ల నువ్వులు టైప్ 2 మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. అధిక మూత్ర వ్యాధితో బాధపడేవారు నువ్వులు పొడిచేసి, గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తూ వుంటే మంచి ఉపశమనం పొందడమే కాకుండా ఎముకల వ్యాధులు, కీళ్ళనొప్పులు, చర్మ రోగాలు దూరమవుతాయి.
నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లోయర్ బ్లడ్ ప్లజర్, బ్లడ్ వెజల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. మెగ్నీషియం, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో బాధ్యత వహిస్తుంది. ఒక వేళ మధుమేహగ్రస్తుల్లో హైబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.
నల్ల నువ్వులను నీటిలో వేసి నానబెట్టాలి, ఒకటి రెండు గంటల తర్వాత నీటిని ఒక గ్లాసులో వంపుకుని, తేనె మిక్స్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల బ్రీతింగ్ సమస్యలు నివారించబడుతాయి.