ఆ ఊళ్లో పేర్లు ఉండ‌వ్‌.. విజిల్‌తోనే పిలుచుకుంట‌రు ఎక్కడో తెలుసా ?

పెళ్లి అయిన దగ్గర నుండి పిల్లల గురించి ఎన్నో కలలు ఉంటారు చాలామంది. ఆడపిల్ల పుడితే ఏ పేరు పెట్టాలి, అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి అని ముందే పేర్లు అనుకోని పెట్టుకుంటారు. నక్షత్రం, రాశి, తిథి అంటూ నానా తిప్పలు పడ్తుంటరు. కానీ, ఒక ఊర్లో ఇలాంటి అవస్థలేవి ఉండవట. అసలు అక్కడ ప్రజలకు పేర్లే పెట్టరట. అదేంటి పేరు పెట్టకపోతే ఎలా పిలుచుకుంటారు అని అనుకోవచ్చు. కానీ ఆ ఊర్లో ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోరట. దానికోసం విజిల్స్ వాడతారట. కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

Unknown Facts About Congathonమేఘాలయాలోని ఈస్ట్‌ ఖాసి జిల్లా కాంగ్‌థాన్‌ అనే గ్రామంలో ఈ ఆచారం ఉంది. ఈల వారి పూర్వీకులనుంచి సంప్రదాయంగా వస్తున్న ఆచారమట. కాంగ్‌థాన్‌లో 700కి పైగా జనాభా ఉంది. ఎవరైనా కొత్తవాళ్లు ఈ ఊరికి వెళ్తే ఆశ్చర్యపోతారు. విజిల్‌, పక్షుల అరుపులు, సినిమా పాటల్లోని ట్యూన్ల ఆధారంగా అక్కడ పిల్లలకు పేర్లు పెడుతుంటారు. ఇంత అప్డేట్ అవుతున్న ఈ డిజిటల్‌ యుగంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందంటే, తమ వారసత్వాన్ని వాళ్లు ఎలా కాపాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

Unknown Facts About Congathonఅంతేకాదు వారికి చిన్నప్పటి నుండే పదాలు పలకడానికి బదులు సీటీలు కొట్టడం, శబ్దాలు చేయడం, పాటలు పాడటం నేర్పిస్తారట. మన దగ్గర ఎవరైనా రోడ్డు మీద పోయేటప్పుడు ఈల కొడితే వాళ్ళను ఇరగ్గొడతారు. ఈల కొట్టడం అంత తప్పుగా భావిస్తాము. కానీ కాంగ్‌థాన్‌లో మాత్రం పిల్లాడు సీటీ కొడితే అతడు ఎదిగినట్టు భావిస్తారట. ఆనందంతో తల్లితండ్రులు ఆ పిల్లాడిని గుండెలకు హత్తుకుంటారట.

Unknown Facts About Congathonపెట్టుకోడానికి వాళ్లకు పేర్లు లేకపోయినా ఆ విజిల్స్కా మీద కూడా బాగానే కసరత్తు చేస్తారట. మన దగ్గర ఒకే పేరు చాలామందికి ఉంటది. కానీ, కాంగ్‌థాన్‌లో మాత్రం ఒకరికి కేటాయించిన శబ్దం ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి పెట్టరట. వాళ్ళ ఆచారం ప్రకారం పిల్లల తండ్రి కొత్త సీటీ పాడి వినిపిస్తే, తల్లి ఒక శబ్దం వినిపిస్తదట. పెద్ద మనుషులంతా కలిసి తల్లితద్రులు ఇచ్చిన శబ్దాలను జోడించి ఫైనల్‌ గా ఒక ఈల అదే ఒక శబ్దాన్ని నిర్ణయిస్తారట. అసలు అన్ని శబ్దాలు వాళ్లకు ఎలా గుర్తుంటాయో ప్రతీసారి కొత్త శబ్దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో అవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటరో ఏమో మరి? కొత్తగా పుట్టిన వాళ్లకోసం 30 సెకన్ల నిడివితో ఒక ప్రత్యేకమైన విజిల్‌ను రూపొందించి దాన్నే పేరుగా పెడతారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… మనం వెంకటేశ్వర్లు అని పేరు ఉన్నవాళ్ళని ఎలా ఇంట్లో ముద్దుగా వెంకీ అని పిలుచుకుంటామో, వాళ్ళు కూడా అలాగే బయట ఉన్నప్పుడు మాత్రమే ఈ 30 సెకన్ల సీటీతో పిలుస్తారట. అదే ఇంట్లో ఉంటే ఆరు సెకన్ల విజిల్‌తో పిలుస్తారట.

Unknown Facts About Congathonఇలా ఈల శబ్దాలతో పేర్లు పెట్టడాన్ని ‘జిగవా యోబి’ అంటారు. అంటే వారి భాషలో ‘అమ్మ ప్రేమ’ అని అర్థం. ఆ సీటీల శబ్దాలతోనే వాళ్లు మనుషులను అర్థం చేసుకుంకుంటారట. ఒక ఇంట్లో పదిమంది ఉంటే పది రకాల సీటీలు ఉంటాయట. అంతేకాదు మన పెద్దలు మనకు జోలపాట పాడి నిద్రపుచ్చినట్టే వీళ్ల పూర్వీకులు సీటీలద్వారా ప్రత్యేక ట్యూన్లు కట్టి పిల్లలను లాలించే వారట. అలా ఎన్నో రకాల ట్యూన్‌లతో లాలించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోందట. కాంగ్‌థాన్‌ కొండల మధ్య ఉంటుంది. అడవికి వెళ్లిన వాళ్లు ఊరు చేరుకోవడానికి సరైన మార్గం లేదు. దాదాపు 10 కి.మీ. ట్రెక్కింగ్‌ చేయాల్సిందే. వ్యవసాయమే వారి బతుకుదెరువు. వారం, పది రోజులకు ఒకసారి మాత్రమే అంగడికి వెళ్లి, పొలంలో పండించిన కూరగాయలను అమ్మి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటారు. అడవిలో ఎవరైనా తప్పిపోతే, తమ పేరును గట్టిగా పాటలాగా పాడుతారట. అది విన్నవాళ్లు వచ్చి కాపాడతారు. సాయంగా వెళ్లిన వాళ్లూ… ఒకరినొకరు సీటీల ద్వారానే పలుకరించుకుంటారు.

Unknown Facts About Congathonఇక ఇక్కడి ప్రజలు బయటి వాళ్లతో అంతగా కలిసిపోరు. ఈ తెగలో పెద్దగా చుదువుకున్న వాళ్లు కూడా లేరు. ఇప్పటి వరకు ఈ ఊరి నుండి ఆరుగురంటే ఆరుగురు మాత్రమే ఉన్నత చదువులకోసం ఊరు దాటారు అంటే అర్థమవుతుంది అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాంగ్‌థాన్‌ ప్రజల సంప్రదాయం ఆసక్తికరంగా ఉండటంతో, ఆ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నరు. విదేశీ పరిశోధక విద్యార్థులు సైతం ఇక్కడి ప్రజల జీవన విధానం గురించి అధ్యయనం చేస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR