మాయదారి కరోనాతో ప్రపంచం మొత్తం తల్లడిల్లుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వస్తోంది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రెడ్డీస్ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి చేసిన 2డీజీ డ్రగ్‌ను అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.
పొడి రూపంలో లభించే ఈ మెడిసిన్‌ను నీటిలో కలుపుకొని తాగవచ్చు. ఈ డ్రగ్‌ను నీళ్లలో కలుపుకొని తాగితే వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. ఈ మందు వాడకంతో కరోనా రోగులు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చట. కరోనా రోగుల ఆక్సిజనల్ లెవల్ తగ్గిపోవడంతో పాటు వారి పరిస్థితి అంతకంతకూ దారుణంగా మారుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు యాంటీ కోవిడ్ డ్రగ్ అయిన 2–డీజీ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందట. శరీరంలో గ్లూకోజ్ ఎలాగైతే పనిచేస్తుందో, అదేమాదిరిగా ఈ మందు కూడా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైన కణాల్లో చేరి వాటి శక్తిని తగ్గిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్ వ్యాపించడం లేదా దాని వృద్ధి తగ్గిపోతుంది. తద్వారా రోగి ఆక్సిజన్ సపోర్ట్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటాడు.
గతంలో ఈ డ్రగ్ క్యాన్సర్ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదు. దాంతో శరీరంలో కరోనా వ్యాప్తి జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పొడి కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే.. కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి బాగవుతాయి. పేషెంట్లు త్వరగా కోలుకుంటారు.
ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. పైగా దీని వాడకం కూడా సులభం. వ్యాక్సిన్ వేయించుకుంటే నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. కానీ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త పౌడర్ తీసుకోవడం చాలా సింపుల్. ప్యాకెట్ చింపడం.. గ్లాస్ లో కలుపుకోవడం.. తాగేయడం అంతే. కానీ తాగితే.. హాస్పిటల్ బెడ్డు మీద ఉన్న వాళ్లు కూడా లేచి తిరుగుతారు. ఏం చక్కా తమ పనులు తాము చేసుకుంటారు. ప్రాణ భయం పోతుంది. బతుకు పై ఆశ కలుగుతుంది.
అయితే దీనివల్ల కరోనా పూర్తిగా తగ్గుతుందా అంటే… కచ్చితంగా అవును అని చెప్పలేం. కానీ వైరస్ పెరగకుండా మాత్రం కచ్చితంగా ఆపుతుంది. అందులో ఎలాంటి డౌటూ లేదు. ఉదాహరణకి శరీరంలో వంద కరోనా కణాలు ఉంటే, వాటి బతుకు అంతే. అవి కూడా ఆకలితో అలమటించి చావాల్సిందే. అవి స్ప్రెడ్ కావడానికి ఉండే ఆప్షన్స్ అన్నీ ఈ పౌడర్ డిలీట్ చేస్తుంది.
కరోనాకి మాత్రం స్ప్రెడ్ అవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోని రెడ్డీస్ ల్యాబ్ లోనే తయారు చేశారు. ఆల్రెడీ ఉన్న మందే కావడంతో… ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఎమర్జెన్సీగా ఈ మందుకి పర్మిషన్ ఇచ్చి.. రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం.