కరోనా కాలంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలు!

ఇండియాలో ప్రస్తుతం సెకెండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంది. సెకెండ్ వేవ్ లో పిల్లలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. పిల్లల్లో వచ్చే లక్షణాల్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. దీంతో చాలమంది చిన్నారుల పరిస్థితి విషమంగా తయారవుతోంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఎక్కువగా కరనా దాడి చేస్తోంది. చిన్నారుల్లో సాధారణంగా కనిపించే కరోనా లక్షణాలు… గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఆకలి మందగించడం, వాంతులు, విరోచనాలు, ఒళ్లంతా దద్దుర్లు, జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుకాగా 2 నెలల నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల్లో కరోనా లక్షణాలు ఏ స్థాయిలో ఎలా ఉంటాయనే అంశంపై కేంద్రం సూచనలు చేసింది. ఆ లక్షణాల ఆధారంగా పిల్లల్లో కరోనా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని సూచించింది. అంతేకాకుండా.. చిన్నారులకు స్టెరాయిడ్ చికిత్స అందించవచ్చా లేదా అనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది. గొంతులో నొప్పి, అతిగా ముక్కుకారడం, దగ్గు లాంటి లక్షణాల్ని స్వల్ప శ్రేణి కరోనాగా పరిగణించాలని కేంద్రం సూచించింది. ప్రాధమిక స్థాయి కరోనా లక్షణాల్లో శ్వాస తీసుకోవడం సాధారణంగానే ఉంటుందని స్పష్టంచేసింది. ఇలాంటి పిల్లల్ని హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సిన అవసరం లేదని, హోమ్ ఐసొలేషన్ లోనే ఉంచి నయం చేయొచ్చని తెలిపింది. సమతులాహారంతో పాటు పారాసిట్మాల్ డ్రాప్స్ లేదా టానిక్ ఉపయోగించొచ్చని సూచించింది.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుసాధారణంగానే పెద్దల క‌న్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ‌గా వస్తాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్రత త‌క్కువ‌గా పాటిస్తారు. స్కూల్‌లోనూ ఇత‌ర పిల్లలతో క‌ల‌సి తిరుగుతారు క‌నుక వారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.ఇక కరోనా సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తల్లితండ్రుల ద్వారానో, బంధువులు, చుట్టూ పక్కల వారి వలనో కరోనా సంక్రమించే ప్రమాదం ఉంది. అయితే పిల్లలు అనారోగ్య సమస్యల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే వారిలో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు నుంచి కూడా త‌ప్పించుకోవ‌చ్చు.

అల్లం16 ఏళ్ల లోపు వయస్సున్నవారు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం. సరైన పోషక పదార్ధాలున్న ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచవచ్చు. మరి ఆ ఆహారపదార్ధాలేంటో ఇప్పుడు చూద్దాం..పిల్లలకు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ స‌మ‌తూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మ జాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకు ప‌చ్చని కూర‌గాయ‌లు, బీన్స్‌, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీని వ‌ల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుపిల్లలకు గుడ్లు తినిపించడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి తక్కువగా ఉన్న పిల్లలే తరచూ జ్వరం బారిన పడుతుంటారు. విటమిన్ డి ఉదయం పూట సూర్యరశ్మిలో లేదా కొన్ని రకాల ఆహారపదార్ధాల్లో లభ్యమవుతుంది. గుడ్లలో విటమిన్ డి తో పాటు విటమిన్ బి, ఈ, సెలీనియం ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతాయి. గోధుమ పిండి, బియ్యం, పాస్తా, బ్రెడ్ పెరుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి అద్భుతంగా పని చేస్తాయి.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుపిల్లలకు కార్బొహైడ్రేట్లు తృణధాన్యాలు నుండి వస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్ B సముదాయాలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల సీడ్స్ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఉపయోగపడుతాయి. ముఖ్యంగా గుమ్మడి విత్తనాలు, సన్ ఫ్లవర్ విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఇమ్యూనిటీ బూస్టింగ్‌గా పని చేస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల విటమిన్ ఈ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. పచ్చి బఠానీలు కూడా శరీరానికి చాలా బలం.ఇందులో విటమిన్ ఏ, బీ1, బీ6 సమృద్ధిగా ఉంటాయి.అంతేకాకుండా ఇందులో ఉండే పాలిఫెనాల్స్,కెరోటినాయిడ్స్,ఫ్లేవనాయిడ్స్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుఇక ఆకుకూరల్లో పాలకూరను మించింది లేదు. పాలకూరలో ఇమ్యూన్ సిస్టమ్‌ని బలపరిచే మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. పాల కూరలో విటమిన్స్ ఏ, సీ, ఈ, కే, ఫోలేట్, మాంగనీస్, జింక్, సెలీనియం, ఐరన్ ఉంటాయి. వారానికి 2-3 సార్లు పాలకూర తినడం అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది. త్వరగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుఅన్ని రకాల పప్పుల్లోనూ ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. పప్పుల్లో ఉండే ఫైటో కెమికల్స్ శరీరం రోగాల బారిన పడకుండా కాపాడతాయి. బాదం పప్పుు అద్భుతమైన ఔషధం. ఇందులో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ మరింత బలంగా ఉండేందుకు సహయపడతాయి. అయితే బాదం పప్పును 4-5 గంటలు నానబెట్టి లేదా రాత్రి పూట నానబెట్టి ఉదయం తొక్క తీసి ఇస్తే మంచిది.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుపుట్టగొడుగులో మంచి పోషకాహారం మరియు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఇది పిల్లల అనారోగ్యమును తగ్గించడానికి సహాయ పడుతుంది . దుంపలు మరియు తియ్యటి బంగాళాదుంపలు పోషకమైన ఆహారములు మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన ఆహారాలు కూడా. దుంపలు బీటా-కెరోటిన్ ని కలిగి ఉంటాయి, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది వైరస్లు మరియు అనారోగ్యాలను కలిగించే వాటి నుండి రక్షణ కల్పిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుపెరుగు రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుంది.ఇందులో ఉండే హెల్దీ బ్యాక్టీరియా గట్ హెల్త్‌ని కాపాడుతుంది.దీని వల్ల అనేక వ్యాధులు మనని దరి చేరకుండా ఉంటాయి. పెరుగుని మజ్జిగ రూపంలో అయినా తీసుకోవచ్చు. మజ్జిగ చేసి తాగించవచ్చు.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలునిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతే కాక విటమిన్ సీ బాడీ పోషకాలని గ్రహించేందుకు దోహదపడుతుంది.

రోగ నిరోధక శక్తి పెంచే చిట్కాలుపిల్లలకు గుడుచి, అమ‌లాకి (ఉసిరి), య‌ష్టిమ‌ధు, గుగ్గుళ్లు త‌దిత‌ర ఆయుర్వేద మూలిక‌ల‌ను నిత్యం ఇవ్వాలి. డాక్టర్ల సూచ‌న మేర‌కు వీటిని పిల్లలకు ఇస్తుంటే పిల్లల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే నిద్ర స‌రిగ్గా పోక‌పోతే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయో పిల్లకు త‌ల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర త‌గినంత‌గా ఉంటే పిల్లల్లో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR