వైట్ ఫంగస్ లక్షణాలు ఏంటి ? దీని వలన కలిగే అనర్దాలు

దేశవ్యాప్తంగా కరోనా విలయానికితోడు మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్ ఆందోళనలు పెరిగిపోతుంది. కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు. మ్యూకోర్ మైకోసిస్ అనేది మానవ శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. దీనిని బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అని పిలుస్తున్నాం. ఇది కరోనా సోకిన వారి మెదడు, ఊపిరితిత్తులు, చర్మం, ముఖంపై దాడి చేస్తుంది. కొందరు బాధితులు కంటి చూపు సైతం కోల్పోయారు. కరోనాకు చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం చూపు మందగిస్తే ముఖ్యంగా స్టెరాయిడ్స్ తీసుకున్న వారు, మధుమేహం ఉన్నవారు వెంటనే నేత్ర వైద్యులను కలవాలని మరీ ముఖ్యంగా రెటీనా స్పెషలిస్టులను కలవాలని డాక్టర్లు సూచించారు.

వైట్ ఫంగస్అయితే కోవిడ్19 బారి నుంచి కోలుకున్న వారిలోనే వైట్ ఫంగస్ కేసులు రావడం ఆందోళన పెంచుతోంది. మధుమేహంతో బాధపడుతున్నవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు వైట్ ఫంగస్ బారినపడే అవకాశాలు ఎక్కువ. అలాగే, కరోనా వైరస్ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నవారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. కరోనా లక్షణాలు కనిపించడంతో వీరికి టెస్టులు చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్19 వైరస్ సోకకున్నా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ నమోదయ్యాయని పీఎంసీహెచ్ మైక్రోబయాలీ విభాగం వెల్లడించింది. యాంటీ ఫంగల్ మెడిసిన్ వాడకం ద్వారా ఆ నలుగురు కోలుకున్నారని, వారికి ప్రస్తుతం నెగెటివ్ అని తేలినట్లు తెలిపారు. హెచ్ఆర్‌సీటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ ప్రభావాన్ని గుర్తించడం సాధ్యపడుతుందన్నారు.

వైట్ ఫంగస్వైట్ ఫంగస్ లక్షణాలు సైతం కరోనా వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ లక్షణాలను పోలి ఉన్నాయని, బ్లాక్‌ ఫంగస్‌ కంటే వైట్‌ ఫంగస్‌ చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ వస్తోంది. వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోంది. కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించినా…పరీక్షల్లో నెగెటివ్ వస్తే మాత్రం వైట్ ఫంగస్‌కు సంబంధించిన పరీక్షలు తప్పనిసరి అంటున్నారు. ఇందు కోసం వీరికి మ్యూకస్ కల్చర్ పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. ఇది కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, మర్మాంగాలు, నోరు భాగాలపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

వైట్ ఫంగస్కరోనా వైరస్ బారినపడిప్పుడు కనబడుతున్న లక్షణాలే ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పడు కూడా కనబడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, HRCT (హెచ్‌ఆర్‌సీటీ) టెస్ట్‌ చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన మాదిరిగానే రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని, డయాబెటిస్‌, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల వైట్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. వైట్ ఫంగస్ రోగుల ఊపిరితిత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. వైద్యులు ప్రకారం.. క్యాన్సర్ రోగులు వైట్ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైట్ ఫంగస్ పిల్లలు, మహిళలకు కూడా సోకుతుంది. ఇది ల్యూకోరోయాకు ప్రధాన కారణం.

వైట్ ఫంగస్అసలే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బ్లాక్ ఫంగస్ సోకటం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది. బ్లాక్ ఫంగస్ కేసులతోనే కరోనా వైరస్ రోగులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా దానికన్నా ప్రమాధకరమైన వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. రోజు రోజుకి పరిస్థితులు భయానకంగా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు వణికిపోతున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR