చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

బ్రహ్మ దేవుడికి ఎక్కడా పూజింపబడవని భృగు మహర్షి శాపం ఇస్తాడు. ఆ శాపం కారణంగానే బ్రహ్మ దేవునికి ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు. కానీ రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం , కాశీ లో ఒక ఆలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చేబ్రోలు ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. గుంటూరులోని ఆలయం బ్రహ్మ దేవునికి ఉన్న అతి కొద్ది ఆలయాలలో ఒకటి. ఇక్కడ బ్రహ్మకు ప్రత్యేక రూపం లేక శివలింగం రూపంలోనే, నాలుగువైపులా అందంగా చెక్కబడిన నాలుగు బ్రహ్మ ముఖాలతో దర్శనమిస్తాడు.

బ్రహ్మ లింగేశ్వర స్వామిభారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఆ ఆయలంలో బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఉన్నందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. స్థలపురాణం ప్రకారం ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భువికి రప్పించారు. బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించినట్లు దీంతో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లు కథనం. అందుకే ఈప్రాంతం బలిఘట్టంగా పేరుగాంచింది. బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈశివలింగానికి ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినాన్న పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

బ్రహ్మ లింగేశ్వర స్వామిహిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడటంతో వరహానదిగా పేరుగాంచినట్లు చెబుతున్నారు. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు.

బ్రహ్మ లింగేశ్వర స్వామిబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు, పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు.

బ్రహ్మ లింగేశ్వర స్వామిఇక్కడి ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది. సమీపంలో విభూతి గనులు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలోనే కొనసాగుతుంది. దేవాలయానికి గల ఆస్తులతోనే నిత్య ధూప, దీప, నైవేధ్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

బ్రహ్మ లింగేశ్వర స్వామిఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిసేకాలు చేయించుకుంటారు. అలాగే ప్రతీ ఏటా కార్తీమాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుపుతుంటారు. ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఆ దగ్గరే భీమేశ్వర ఆలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణాలు.

బ్రహ్మ లింగేశ్వర స్వామితొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది. లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట. మొదట ఇక్కడ కుమార స్వామికి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లోనే చౌడేశ్వర, గణపేశ్వర ఆలయాలు నిర్మించారు. తర్వాత భీమేశ్వర ఆలయం. ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినది. ఈ గుడికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR