వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేయ‌డం వ‌ల్ల టీకా సామ‌ర్థ్యం తగ్గుతుందా ?

వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు, కేసులు పెరుగుతునే ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అందరికీ రకరకాల సందేహాలున్నాయి. చాలా రకాల సందేహాలతోపాటు భయం కూడా ఉంది. కరోనా వచ్చినప్పుడు ఎన్ని అనుమానాలో, ఇప్పుడు వ్యాక్సిన్ మీద అన్ని అనుమానాలున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్కి తట్టుకుంటామో? లేదో? అన్న సందేహంతో 30 శాతం మంది వ్యాక్సినేషన్కి దూరంగా ఉన్నారు.

వ్యాక్సిన్వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీస్ పెరగాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఏమి తినాలి?’ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. యాంటీబాడీస్ కోసం ప్రత్యేకంగా తినాల్సినవంటూ ఏదీ లేదు. అన్నీ తినాలి. తినొచ్చు. అలాగే వ్యాయామాలు చేస్తే పెరుగుతుందని లేదు. కానీ, ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం సాయపడుతుంది. శారీరకంగా ఫిట్ నెస్ తో ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది.

వ్యాక్సిన్నిజానికి వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ఒక వ్య‌క్తి దానికి ఎలా స్పందిస్తాడో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఒక్కొక్కరిలో రియాక్షన్ ఒక్కోలా ఉంటుంది. శరీరతత్వాన్ని బట్టి, రోజువారీ జీవనశైలిని బట్టి రియాక్షన్ ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, త‌ర్వాత వ్యాయామం చేయ‌డం వ‌ల్ల టీకా సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ప్ర‌తి రోజు వ్యాయామం చేసేవారు, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాల‌ను పాటించేవాళ్లు వ్యాక్సిన్‌కు తొంద‌ర‌గా స్పందిస్తారు. వ్యాయామం చేయ‌ని వారితో పోలిస్తే వ్యాయమం చేస్తూ హెల్తీ లైఫ్‌స్టైల్ పాటించే వారిలో యాంటీబాడీలు ఎక్కువ‌గా వృద్ధి చెందుతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అధిక యాంటీబాడీలు తయారైనట్టు ఓ అధ్యయనంలో తేలింది.

వ్యాక్సిన్ఈ అధ్యయనంలో దాదాపు 50శాతానికి పైగా అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు పెరిగాయని గుర్తించారు. వ్యాయాయం చేయనివారికంటే వ్యాయామంలో యాక్టివ్ గా ఉండేవారిలోనే వ్యాక్సిన్ తాలూకూ యాంటీబాడీల శాతం భారీగా పెరిగినట్టు నిర్ధారించారు. వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిలో అనారోగ్య ముప్పు తగ్గించడమే కాకుండా వ్యాధులతో మరణించే ముప్పు కూడా 37శాతం తగ్గినట్టు తేలింది.

వ్యాక్సిన్సాధార‌ణంగా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ఇంజెక్ష‌న్ ఇచ్చిన ప్ర‌దేశంలో నొప్పి లేదా వాపు, నీర‌సం, త‌ల‌నొప్పి, జ్వ‌రం, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపిస్తాయి. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే ఇలాంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తే వెంట‌నే దానికి త‌గ్గ‌ట్లు వ‌ర్క‌వుట్ ప్లాన్ మార్చుకోవాలి. రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేస్తుంటే ఫ‌ర్వాలేదు కానీ.. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత వెంట‌నే కొత్త‌గా వ‌ర్క‌వుట్స్ చేయ‌డం మొద‌లు పెట్ట‌కూడ‌దు. అతిగా లేదా కొత్త‌గా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కూడా వ్యాక్సిన్ తీసుకున్న చోట నొప్పి పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఫిజియోథెర‌పిస్ట్ లు చెబుతున్నారు.

వ్యాక్సిన్వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రెండు మూడు రోజుల పాటు అల‌స‌ట‌, కండ‌రాల నొప్పి ఉంటుంది. కాబ‌ట్టి కొద్ది రోజులు వ్యాయామానికి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవ‌డమే మంచిది. కొద్ది రోజులు వ్యాయమం నుంచి బ్రేక్ తీసుకోవ‌డం వ‌ల్ల నష్టమేమి లేదు. ఒక్క రోజులోనే బ‌రువు పెర‌గ‌డం కానీ త‌గ్గ‌డం కానీ సాధ్యం కాదు. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మ‌న శ‌రీరం కోలుకోవ‌డం చాలా ముఖ్యం.

వ్యాక్సిన్కరోనా సమయంలో అనే కాదు సాధారణ సమయంలో కూడా రోజువారీ శారీరక శ్రమ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. శారీరక వ్యాయామం అనారోగ్య ముప్పును తగ్గించడమే కాకుండా వైరస్ ల బారిన పడకుండా రక్షిస్తుందని, అలాగే వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో టీకా సమర్థతను కూడా పెంచినట్టు తేలింది. అంతేకాదు.. న్యూమోనియా, కరోనాతో మరణించే ముప్పులను కూడా ఫిజికల్ యాక్టివిటీతో తగ్గించుకోవచ్చునని పరిశోధకులు గుర్తించారు. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా స్థూలకాయం, డయాబెటిస్, శ్వాసపరమైన వ్యాధులు, గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధుల బారినుంచి రక్షించుకోవచ్చునని అధ్యయనంలో రుజువైంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR