పొన్నగంటి ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఇది ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీన్ని ఇళ్లల్లో చిన్న చిన్న కుండీలలో వేసి పెంచుకుంటే ఎంతో సులువుగా పెరుగుతుంది. ఇవి ఏడాది పొడవునా కూడా లభిస్తాయి. తోట కూర లాగానే దీన్ని రకరకాలుగా వండుకోవచ్చు. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే చాలా రుచికరంగా వుంటుంది.

పొన్నగంటి ఆకుపొన్నగంటి కూరను పప్పు లేదా ఇతర కూరగాయలతో కలిపి పలురకాలుగా వాడతారు. ఇది అతి సులభంగా, అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారా అభివృద్ధి చెందగలదు. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పొన్నగంటి ఆకుజీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధంలో వంటిలోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. పురాతన పుస్తకాలు, భారతీయ వైద్య గురువులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది..

పొన్నగంటి ఆకుథైలాం అని పిలువబడే పొన్నంగంటి నూనె శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని, భారతదేశంలో అధిక శరీర వేడి, తలనొప్పికి తగ్గటానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది. జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది. పొన్నగంటి ఆకును ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

పొన్నగంటి ఆకుపొన్నగంటి ఆకును తాళింపు వేసుకొని ఆహారంగా తీసుకుంటే కంటి క్రింద నల్లని వలయాలు, కంటి సమస్యలు దూరమవుతాయి. కంటికలకలూ కురుపులతో బాధపడేవాళ్లు తాజా ఆకుల్ని కళ్లమీద కాసేపు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

పొన్నగంటి ఆకుప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారాల్లో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండడంతో అవి రక్తంలో కలిసిపోతున్నాయి. దాంతో రక్తం అశుభ్రమైపోతుంది. పొన్నగంటి కూర తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడానికి పొన్నగంటి కూర ఎంతగానో ఉపకరిస్తుంది.

పొన్నగంటి ఆకుశుభ్రం చేసిన పొన్నగంటి ఆకును ముక్కలుగా చేసి, పెసరపప్పు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. వైరల్‌, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. అందుకే పూర్వం క్షయరోగులకు దీన్ని తప్పక పెట్టేవారు. హెచ్‌ఐవీ వైరస్‌ సోకినవాళ్లకీ ఇది మంచిదే.

పొన్నగంటి ఆకుఅట్లే కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే బరువు పెరుగుతారు. అలాగే అధిక బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి ఆకు, కందిపప్పు బాగా ఉడికించుకుని అందులో కొద్దిగా నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు వేసి మరికాసేపు ఉడికించి సేవిస్తే నెలరోజుల్లో స్లిమ్‌గా మారుతారు. పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పొన్నగంటి ఆకుదీనివల్ల బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్ఠవం పెరగడం వంటి ఎన్నో ఉపయోగాలే కాదు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ఫొలేట్, ‘రైబోఫ్లెవిన్’, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఈ ఆకులో సమృద్ధిగా దొరకుతాయి. పొన్నగంటి ఆకుతో తాలింపు తయారుచేసి ప్రతిరోజూ సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఆ కూరను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీర ఛాయ మెరుగుపడుతుంది.

పొన్నగంటి ఆకుగుండెకు, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.

Heart Attack in young peopleఈ ఆకు జీవక్రియాలోపాలనూ వీర్యకణాల్లోని లోపాలనూ సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకులరసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట. మధుమేహుల్లో ఇది కణజాలం దెబ్బతినకుండా చూడటంతోబాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతోబాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

పొన్నగంటి ఆకుమొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిది. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR