గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసా ?

మహిళలకు వారి జీవితంలో గర్భం అనేది చాలా ముఖ్యమైనది. గర్భిణీలు వారితో పాటు వారి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. వారి కడుపులో గల శిశువు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు గురికాకుండా ఉంటుంది. గర్భావధికాలంలో తల్లి ద్వారానే ఆహారం, ఆయువును బిడ్డ పొందుతుంది. పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా ఉండేందకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

గర్భిణీఅయితే గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అవసరం అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. వీలైనంత వరకు శక్తి, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దీని వల్ల శిశువు ఎదుగుదల బాగా ఉంటుది. గర్భిణులు తొలి నెల నుండి చివరి నెల వరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గర్భం సురక్షితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి.

గర్భిణీగర్భం దాల్చిన మొదటి నెల నుండే ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువుపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. కానీ బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా ఎక్కువ ఆహారం తీసుకోవలసిన అవసరం చాలా ఉంది.

గర్భిణీగర్భవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వు పదార్ధాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తీసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది. గర్భవతులు, బాలింతలు తీసుకొనే ఆహారంలో అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అవసరం. గర్భస్ధ దశలో ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనత కాన్పు సమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువుతో పుడతారు. కనుక ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.

గర్భిణీమెుదటి నెలలో రెండుపూటలా కలకండను పాలలో కలుపుకుని తీసుకోవాలి. రెండవ నెలలో గోరువెచ్చని పాలలో శతావరీ చూర్ణాన్ని కలిపి సేవిస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. మూడల నెలలో చల్లటి పాలలో కొద్దిగా నెయ్యి, తేనె కలుపుకుని తీసుకోవాలి. నాలుగవ నెలలో పాలలో వెన్న కలిపి సేవిస్తే మంచిది. ఐదవ నెలలో పాలలో నెయ్యి, ఆరు, ఏడవ నెలలో పాలు, శతావరీ చూర్ణాన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలిపి తీసుకోవాలి. చివరిగా పదవ నెలలో శతవర నూనెను ప్రతిరోజూ 50 గ్రాములు తీసుకుంటే అలసటగా ఉండదు.

గర్భిణీఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు వగైరా తీసుకోవాలి . మొదటి ఆరునెలలు నెలకొకసారి, ఏడు, ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరం. సొంతంగా మందులు వాడడం, ఎక్సరేలు తీయించుకోవడం చేయకూడదు. ఎత్తు మడమల చెప్పులు వాడకూడదు. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు.

గర్భిణీగర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.

గర్భిణీపగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి, లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారి తీయును. కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతిలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది. ఛాతిలో మంట నిద్రరానివ్వదు. పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.

గర్భిణీపగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి. నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR