క్యారెట్ రెగ్యులర్ గా తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కరోనా రావడం వలన ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. దీంతో చాలా మంది జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నారు. ఇలాంటి పోషకాలు పుష్కలంగా లభించే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒకటి.

క్యారెట్ జ్యూస్క్యారెట్లు, బీట్‌రూట్, ముల్లంగి వంటి కూరగాయలు రోగనిరోధక శక్తి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇవి సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభిస్తాయి. క్యారెట్లలో అధిక పోషకాహార విలువలు ఉండటం వలన, వీటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

క్యారెట్ జ్యూస్చాలామంది క్యారెట్ ను కంటి ఆరోగ్యం కోసం తింటారు. క్యారెట్ తింటే కండ్లు బాగా కనిపిస్తాయి. అలాగే.. క్యారెట్ లో ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారట్స్ లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు క్యారట్ జ్యూస్ 100 క్యాలరీలను అందిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడే ఫైబర్ ని కలిగి ఉంటాయి.

క్యారెట్ జ్యూస్అయితే.. చాలామంది క్యారెట్ ను కూరలో వేసుకొని వండుకోవడం లేదా పచ్చి క్యారెట్ ను అలాగే తినడం చేస్తారు. అయితే.. క్యారెట్ ను అలా పచ్చిగా తినడం కంటే కూడా.. దాన్ని జ్యూస్ గా చేసుకొని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. రెగ్యులర్ గా క్యారట్ జ్యూస్ తాగడం వల్ల.. రకరకాల వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. మరి ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ జ్యూస్క్యారెట్ జ్యూస్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అర గ్లాసు క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేయగలదని డాక్టర్లు పేర్కొంటున్నారు. అంతేకాక, ఇది జీర్ణాశయ సమస్యలు, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.

క్యారెట్ జ్యూస్ఖచ్చితంగా మూడు వారాల పాటు క్యారట్ జ్యూస్ తాగడం వల్ల ప్లాస్మా కెరోటనాయిడ్స్ మెరుగుపరిచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. క్యారట్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. సిస్టోలిక్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. అంటే ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు గుండె ఎదుర్కొనే సమస్యలతో పోరాడే శక్తిని పొందవచ్చు.

క్యారెట్ జ్యూస్ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగడం వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, షుగర్ తో పాటు.. ముఖ్యమైన పోషకాలు, మినరల్స్ ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తాగితే.. డయాబెటిస్ రిస్క్ కి దూరంగా ఉండవచ్చు.

క్యారెట్ జ్యూస్క్యారట్ జ్యూస్ లో విటమిన్ బి6, కే, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవన్నీ.. ఎముకల ఆరోగ్యానికి, బలానికి, బలమైన నరాల వ్యవస్థకు, బ్రెయిన్ పవర్ పెంచడానికి సహాయపడతాయి. రక్తంలో ఎసిడిటిని తగ్గించడంలో క్యారట్ జ్యూస్ సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో ఉండే ఆల్కలైన్ నేచర్ జీవక్రియలో ఎసిడిటిని న్యూట్రలైజ్ చేస్తుంది.

క్యారెట్ జ్యూస్ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ ద్వారా రోజుకి కావాల్సిన 6 శాతం ఐరన్ పొందవచ్చు. అలాగే క్యారట్ జ్యూస్ విటమిన్ సి కూడా లభిస్తుంది. వెజిటేరియన్స్ కి అనీమియా రిస్క్ ఉంటుంది. కాబట్టి.. ప్లాంట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. ఐరన్ గ్రహించవచ్చు. మలబద్దకం నివారించడంలో క్యారట్ జ్యూస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా ఆకుకూరలు మిక్స్ చేసి, క్యారట్ జ్యూస్ తయారుచేసుకుని ప్రతి రోజూ తాగడం వల్ల మలబద్దకం నివారించవచ్చు.

క్యారెట్ జ్యూస్ముఖ్యంగా మహిళలకు అయితే క్యారెట్ జ్యూస్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పురుషుల కన్నా.. మహిళలకు క్యారెట్ వల్ల చాలా లాభాలు ఉంటాయట. రోజూ ఒక్క గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ తో ఎఫెక్టివ్ గా పోరాడుతుంది.

క్యారెట్ జ్యూస్అలాగే.. మహిళల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం మీద పడే ముడతలు కూడా తగ్గుతాయి. క్యారట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం, జుట్టు న్యాచురల్ గ్లో పొందడానికి సహాయపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR