గర్భగుడిలో దేవుడి విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కాదేదీ పూజకు అనర్హం అనే విధంగా మన దేశంలో కొన్ని ఆశ్చర్యకర దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో పురాతన ఆలయాలు ఇంకెన్నో అద్భుత కట్టడాలు. ప్రతి ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయం విషయానికి వస్తే సరికొత్త ప్రదేశాలను సందర్శించాలనే కుతూహలం ఉన్న వారికి ఇది సరైన ఎంపిక అని చెప్పవచ్చు. మన దేశంలో ఇటువంటి ఆలయాలు ఉన్నాయనే విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజం.

Avudaiyarkoil Templeమనం ఏదైనా క్షేత్రానికి ఎందుకు వెళతాం? దేవుడి దర్శనానికే కదా చిన్న పెద్ద దూరమో దగ్గరో ఆలయానికి వెళ్ళేది మాత్రం దేవుడి ధర్శనానికే. కొన్ని ఆలయాలకు సులభంగా వెళతాం. మరి కొన్ని ఆలయాలకు వెళ్ళడానికి ఎంతో ప్రయాస పడాల్సి ఉంటుంది. కానీ ఈ ఆలయం అన్నిటికి బిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదే కాని గర్భగుడిలో దేవుడి విగ్రహం మాత్రం ఉండదు. అయినా నిత్య ఆరాధన, విశేష పూజలు, నైవేద్యాలు అన్నీ జరుగుతాయి.

Avudaiyarkoil Templeఎక్కడ ఉంది ఇలాంటి వింత ఆలయం అనుకుంటున్నారా. ఈ ఆలయం తమిళనాడులోని పుదుకోట్టాయ్ లో ఉంది. దీనిని అవుడయర్ కోయిల్ అంటారు. ఇక్కడి శివుడిని ఆత్మానంద స్వామి అని పిలుస్తారు. మన శరీరంలో ఉండే ఆత్మ ఎలాగయితే కనపడదో ఇక్కడి శివుని విగ్రహం కూడా అలాగే కనపడదు. ఆత్మ కళ్ళకి కనపడదని మనం ఆత్మని నమ్మటం మానం కదా అలాగే ఇక్కడ విగ్రహం కనపడకపోయినా ఆత్మస్వరూపుడైన శివునికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి.

Avudaiyarkoil Templeఈ ఆలయాన్ని 8 వ శతాబ్దంలో మనికవసాగర్ అనే నయనారు కట్టించారని ప్రతీతి. మనం ఏదైనా శివాలయానికి వెళితే అక్కడ శివలింగం, నందీశ్వరుడు దర్శం ఇస్తారు. అన్ని ఆలయాల్లో ధ్వజ స్థంభం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని ఆలయాలలోలాగా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు, ధ్వజస్తంభం కనపడదు, చండికేస్వరుడు కూడా కనపడడు. ఇక్కడి అమ్మవారిని యోగంబాల్ అని అంటారు అయితే ఈ అమ్మవారు కూడా మనకి విగ్రహ రూపంలో దర్సనమీయరు.

Avudaiyarkoil Templeఇక్కడి ఆలయంలోని పైగోడపై పంచభూతాలని చెక్కారు. నవగ్రహాలకి మండపం లేదు గాని ఈ నవగ్రహాలని మనం ఇక్కడ ఉన్న స్తంభాలపై చూడచ్చు. ఎక్కడా లేని విధంగా 27 నక్షత్రాలకి విగ్రహరూపాలని కూడా ఇక్కడి ఆలయంలో మనం చూడచ్చు. త్యాగరాజ సన్నిధిలో ఉన్న రాతి చైనులు, పంజస్తర మండపంలోని సప్తస్వర స్తంభాలు ఇక్కడ చూడదగ్గవి. దేవుడి విగ్రహం లేకపోయినా శిల్పకళా అణువణువునా పొంగిపొరలే ఈ ఆలయం దర్శించుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది.

Avudaiyarkoil Templeఇక్కడి స్వామి ఆత్మనందుడు బ్రహ్మదేవునికి గాయత్రీ మంత్రాన్ని ఈ సన్నిధిలోనే ఉపదేశించాడని ప్రతీతి. విగ్రహం లేకపోయినా నైవేద్యం పెట్టె అన్నం ఆవిరినే శివుడిగా కొలిచే ఇలాంటి ఆలయం ఇంకోటి ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆలయంలో జరిగే శివాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR