నిద్రలో కలలు కనని వారు చాలా అరుదు. కొంతమందికి అందమైన కలలు వస్తే.. కొంతమంది ఆరోజు తాము చూసిన సన్నివేశాలకు అనుగుణంగా కలలు కంటారు. ఇంకొంతమందికి రకరకాల జంతువులు కలలోకి వస్తాయి. కలలలో కొన్ని మంచివి. కొన్ని భయంగా ఉండేవి. అందులో కొన్ని గుర్తుంటాయి. మరి కొన్ని ఉదయం లేచేసరికి మరిచిపోతాం కూడా. అయితే, ఈ కలలతో మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. కలలు వాటి ఫలితాలు ఆ వివరాలు తెలుసుకుందాం.
ఒకవేళ మీరు చనిపోయినట్లు కల వస్తే.. మీరు కంగారు పడకండి. ఎందుకంటే దీనర్థం మీ జీవితంలో ఒక అంకం పూర్తవుతున్నట్లు సంకేతం.
మంటలు కలలో వస్తే మీరు ఊహించనిది ఏదో జరగబోతుందని అర్థం.ఒకవేళ గర్భంతో ఉన్నట్లు కల వస్తే.. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నట్లు లెక్క.
ఒకవేళ కలలో పాలిస్తున్న ఆవు వస్తే.. మీ నిజ జీవితంలో మీ అమ్మ మీ అవసరాలకు అంతగా స్పందించడం లేదని అర్థమట.
ఒకవేళ మీరు కలలో చేపల్ని చూస్తే మీరు అదృష్టవంతులని అర్థం. మీరు చేపల్ని పడుతున్నట్లు కల వస్తే… మీకు త్వరలో డబ్బు రాబోతుందని సంకేతం.
కొంతమందికి కలలో పాములు వస్తాయి. తెల్లపాము కనిపిస్తే గొప్ప విజయం సాధిస్తారని అర్థం. తెల్లపాము కలలోకి వస్తే సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయట.
కలలో ఏదైనా పర్వతం లేదా కొండ వచ్చినట్లైతే మీ ఉద్యోగ జీవితం లేదా వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని అర్థం.
ఒకవేళ మీ కలలో నెమలి వచ్చిందంటే త్వరలో గుడ్‌న్యూస్ వినబోతున్నట్లు సంకేతమట.
కలలో ఏదైనా చెట్టు నిండా పండ్లతో వచ్చినట్లైతే మీకు త్వరలో డబ్బు రాబోతుందని అర్థం.
ఒకవేళ కలలో గాలిలో ఎగిరినట్లు వస్తే.. జీవితంలో ఎదగబోయే నిర్ణయాలు తీసుకోనున్నట్లు అర్థమట.
ఎవరో తరుముతున్నట్లు కల వస్తే జీవితంలో కష్టాలపై ఎక్కువగా పోరాడుతున్నట్లు.
మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు.
కుక్క తమను చూసి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు.
అగ్నిపురాణం ప్రకారం… కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.
అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువులు. ఇవేగాక…. పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు.