గ్రామ దేవతలు అంటే ఎవరు? గ్రామ దేవతలకు పేర్లు ఏ విధంగా పెడతారు?

ఊరిలో ఏ ఆలయం ఉన్నా లేకపోయినా గ్రామదేవత మాత్రం కచ్చితంగా ఉంటుంది. పోలేరమ్మ పోచమ్మ నూకాలమ్మ ఇలా ఏదో ఒక పేరుతో గ్రామ దేవతలు గ్రామ సరిహద్దులో ఉంటారు. సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా – అందరూ దేవీనవరాత్రుల కాలంలో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడం సాద్యపడకపోవచ్చు.

Unknown Facts About Gramadevataఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశం వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

Unknown Facts About Gramadevataదేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రం సరైన మూహూర్తములోనే వేయబడింది, కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు. భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరం ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడం వల్ల అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.

Unknown Facts About Gramadevataగ్రామదేవతల ఆవిర్భావము:

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచం ఏర్పడింది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.

పృధ్వీ దేవత:

మొదటిది పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారం కాబట్టి ఆపేరుతో గోగులమ్మని ఏర్పాటు చేసారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.

Unknown Facts About Gramadevataమొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడం, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను ఇస్తూ వుండడం, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెళ్లే వారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉంది.

Unknown Facts About Gramadevataజల దేవత:

రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

అగ్ని దేవత:

మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మనీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).

Unknown Facts About Gramadevataవాయు దేవత:

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవం ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు.

ఆకాశ దేవత:

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు.

Unknown Facts About Gramadevataమనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమంగా పోలేరమ్మ అయింది. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి ‘పోచ+అమ్మ=పోచమ్మ’ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.

Unknown Facts About Gramadevataప్రతి వ్యక్తికీ ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట (అవధి)ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేసే+అమ్మ= కట్టమేసెయమ్మ కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్ధంలో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR