పెసరపప్పు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంత ముఖ్యమో పప్పులు కూడా అంతే అవసరం. శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు పప్పు వలన పొందొచ్చు. మన దేశంలో ఎక్కువగా వాడే పప్పుల్లో పెస‌ర‌ప‌ప్పు ఒకటి. దీని గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెస‌ర‌ప‌ప్పుతో ఎన్నో ర‌కాల వంట‌లు చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో పెసర పప్పు వంటకాలు అనేకం. సలాడ్, సూప్, చారు ఇలా రకారకాలుగా వంటకాలను చేస్తుంటారు. పెస‌ర‌ప‌ప్పుతో స్వీట్స్ కూడా త‌యారు చేస్తుంటారు. పెస‌ర‌ప‌ప్పుతో ఏం చేసినా అద్భుతంగా ఉంటాయి అన‌డంలో సందేహ‌మే లేదు. అయితే రుచిలోనే కాదు, ఆరోగ్య ప్ర‌య‌జ‌నాలు అందించ‌డంలోనూ పెస‌ర‌ప‌ప్పు గొప్పగా స‌హాయ‌ప‌డుతుంది.
Health Benefits Of Pesarappu
ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యంలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ పెంచుకోవాలి అని అనుకునే వారు ఖ‌చ్చితంగా పెస‌ర‌ప‌ప్పును డైట్‌లో చేర్చుకోండి. ఎందుకంటే, పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్ బీ9, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బీ4 , ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ బీ2, బీ3, బీ5, బీ6 పుష్కలంగా ఉన్నాయి. పెస‌ర‌ప‌ప్పులో ఇందులో ప్రోటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంపొందిస్తాయి. త‌ద్వారా ఇన్‌ఫెక్షన్స్ ద‌రి చేర‌కుండా ఉంటాయి. మొలకెత్తిన పెసరపప్పును ఉదయాన్నే తింటే శరీరానికి అధికమొత్తంలో ప్రోటీన్స్, ఆమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
Health Benefits Of Pesarappu
పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆకలి కలిగించే హార్మోన్లు ఎక్కువగా పనిచేయవు. ఫలితంగా చాలా సమయం వరకు పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న‌వారు పెస‌ర‌ప‌ప్పు తీసుకుంటే బ‌రువు త‌గ్గొచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి.
Benefits And Disadvantages Of Drumstic
ర‌క్త‌హీన‌త ఉన్న వారు వారానికి రెండు సార్లు అయినా పెస‌ర‌ప‌ప్పును తీసుకుంటే ర‌క్త‌వృద్ధి జ‌రుగుతుంది. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు కూడా పెస‌ర‌ప‌ప్పు తీసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు త్వ‌ర‌గా జీర్ణం అవ్వ‌డంతో పాటు శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది. పెస‌ర‌ప‌ప్పు తీసుకోవ‌డం శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తుంది. త‌ద్వారా గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.
Health Benefits Of Pesarappu
ఇందులో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్ మూలకాలు ఉండడం వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే క్యాన్సర్, వాపు, గుండె జబ్బులు వంటి సమస్యలను నియంత్రిస్తాయి. ఉండే విటాక్సిన్, ఐసోవిటాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి. ఎండవేడి నుంచి దెబ్బతిన్న కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుందని పరిశోదనలో వెల్లడైంది.
Health Benefits Of Pesarappu
ఇందులో ఉండే పీచు పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కార్బ్ ఇతర పదార్థాల కంటే కూడా ఆరోగ్యకరమైనది. ఇది కడుపుని డిటాక్సిఫై చేయడంలో, శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అయితే పెస‌ర‌ప‌ప్పును అధికంగా మాత్రం తీసుకోరాదు. అలా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR