కొండ పిండి ఆకు వలన కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు

ప్రస్తుతం సమాజంలో అన్నీ కలుషితం అవుతున్న విషయం తెలిసిందే. అందుకే మనం చిన్న వయసులోనే ఎన్నో తెలియని అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నాం. అలాంటి ఆరోగ్య సమస్యలలో ఒకటి కిడ్నీలలో రాళ్లు. ఆ రాళ్లను కరిగించడానికి మనము డాక్టర్లను సంప్రదిస్తూనే ఉంటాం. అయితే అంతటి స్తోమత లేని వాళ్లకు ఆయుర్వేదంలో ఓ ఔషధం కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Kondapindi Aakuచెట్ల నుండి తయారు చేసిన ఆయుర్వేద మందులు కాస్త ఆలస్యంగానైనా మంచి ప్రభావం చూపిస్తాయి. అందుకే మన పూర్వీకుల నుండి పలు చికిత్సలకు చెట్ల మందులు వినియోగిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును ఉపయోగించడం. తమిళంలో సిరుపీలై, తెలుగులో కొండ పిండి ఆకు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ మొక్క అద్భుతమైన ఔషధ ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

Kondapindi Aakuఇది ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలో ఉపయోగించబడింది. సిరుపీలాయ్ పౌడర్ అని పిలవబడే ఈ పౌడర్ తమిళనాడులో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది ప్రత్యేకంగా అన్ని మూత్రపిండాల సమస్యలకు చికిత్స చేయడానికి ప్రసిద్ధి చెందింది మరియు కిడ్నీ స్టోన్స్ చికిత్సకు సాంప్రదాయకంగా ఉపయోగించబడుతుంది.

Kondapindi Aakuఇందులో ఉండే కొన్ని ముఖ్యమైన ఆల్కలాయిడ్‌లు ఎర్విన్, ఎర్వోసైడ్, ఏర్వైన్, మిథైలార్విన్, ఏర్వోసైడ్, ఎర్వోలనిన్ మరియు మిథైలర్‌వైన్, కెమ్‌ఫెరోల్, క్వెర్సెటిన్, పెర్సినోల్, పెర్సినోసైడ్స్, మొదలైనవి. ఇందులో లుపియోల్, లుపియోల్ అసిటేట్, బెంజోయిక్ యాసిడ్ మరియు టానిక్ యాసిడ్ వంటి ఇతర సమ్మేళనాలు కూడా ఉన్నాయి. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, పటికబెల్లం పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది.

Kondapindi Aakuఒక వారం కన్నా ఎక్కువ రోజులు తాగినా దీని వల్ల ప్రమాదం ఏమి ఉండదు. ఈ రసం తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కిడ్నీలో ఉండే రాళ్ళు పడిపోవడం, కరిగిపోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా కొండపిండి ఆకు ను కూర ఫ్రై గా చేసుకొని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

Kondapindi Aakuమూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స చేయడంతో పాటు, ఇది తలనొప్పి, బాధాకరమైన మూత్రవిసర్జనకు చికిత్సలో కూడా ప్రసిద్ధి చెందింది. నులిపురుగు నివారణకు కూడా ఇది అద్భుతమైన మందు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ఇది న్యుమోనియా, టైఫాయిడ్ మరియు కామెర్లు వంటి జ్వరాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR