ముఖానికి సంబంధిన అన్నీ సమస్యలకు ఐస్ క్యూబ్స్ తో సమాధానం!

కాలుష్యం, దుమ్ము, ధూళి, చెమట… ఇలాంటివన్నీ ఉద్యోగాలు, చదువులంటూ బయటకు వెళ్లే వారి ముఖాలకు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. ఇక మేకప్ చేసుకునే వారి సంగతి చెప్పనవసరం లేదు. చర్మం ఎలా పాడవుతుందో అందరికీ తెలిసిందే. సూర్యరశ్మి, వాయు కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఒత్తిడిని పెంచుతాయి. వాటి వల్ల ముఖం మీద వచ్చే మొటిమలు, ముడతలు, స్కిన్ గ్లో లేకపోవడం వంటివన్నీ చర్మ సమస్యలకు దారి తీస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి కింద వాపు ఇవన్నీ ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. వీటి నుండి ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయినా కూడా కొందరి ముఖం అలసటగానే ఉంటుంది.
pollution
ఈ సమస్యలన్నిటి నుండి ఉపశమనం పొందడానికి చక్కని పరిష్కారం మన ఫ్రిడ్జ్ లోనే ఉంది. ఫ్రిడ్జ్ లో ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండే ఐస్‌క్యూబ్‌లతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ముఖారవిందాన్ని ఇనుమడింపజేసే సౌందర్యసాదనాలెన్ని ఉన్నా ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ క్యూబ్స్‌తో ప్రతి రోజూ ముఖంపై రుద్దుకుంటే చర్మ రంద్రాలు శుభ్రపడతాయని సౌందర్య నిపుణులు సెలవిస్తున్నారు. ఇలా చేసినప్పుడు ముఖంపై మురికి తొలగిపోతుంది. దాంతో ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
benefits of ice for soft skin

ఇది ముఖం మీద కనిపించే అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, మీ చర్మం యొక్క రంగును ప్రకాశవంతం చేస్తుంది. తద్వారా చర్మం తక్షణ మెరుపును సంతరించుకుంటుంది. మొటిమలపై ఐస్‌క్యూబ్ ఉంచడం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దాంతో మొటిమల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖం మీద ఐస్ ని క్రమం తప్పకుండా రుద్దడం ద్వారా వాపు తగ్గుతుంది. ఐస్‌క్యూబ్ చల్లదనం చర్మం యొక్క రంధ్రాలను బిగుతుగా ఉంచడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

ముఖానికి రాసుకునే సౌందర్య ఉత్పత్తులను చర్మం త్వరగా గ్రహించడానికి కూడా ఐస్‌ క్యూబ్స్‌ ఉపకరిస్తాయి. క్రీమ్‌ లేదా సిరమ్‌ వాడిన తర్వాత ముఖాన్ని ఐస్‌ క్యూబ్స్‌తో రుద్దితే చర్మం మెరుపులు చిందిస్తుంది. ఐస్‌ క్యూబ్స్‌ను వస్త్రంలో చుట్టి దానితో నల్లని వలయాల మీద సున్నితంగా రుద్దితే ఫలితం ఉంటుంది. మేకప్‌ వేసుకునే ముందు ఐస్‌ క్యూబ్‌ లేదా ప్యాక్స్‌ వాడితే మేకప్‌ ఎక్కువసేపు ఉంటుంది. పొడి పెదవులపై ఐస్‌ క్యూబ్స్‌ను సున్నితంగా రుద్దితే వాటిపై ఉన్న పగుళ్లు పోతాయి. మిల్క్‌ ఐస్‌ క్యూబ్స్‌ను చర్మంపై రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి.

ice cube
అలానే మేకప్ ఎక్కువగా వేసుకునే వారి ముఖం ముడతలు మారుతుంది. దాంతో ముఖం అందాన్ని కోల్పోతుంది. అందుకు ఐస్‌క్యూబ్స్‌తో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ముడతలు చర్మం కాస్త మృదువుగా మారుతుంది. మేకప్ శుభ్రం చేయడానికి కూడా ఐస్‌క్యూబ్స్ వాడితే మంచిది. వడదెబ్బ తగిలి చర్మం కందిపోతుంది. అలాంటి సమయంలో ఐస్‌క్యూబ్స్‌తో రబ్ చేయడం వలన కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
make up kit
వేసవిలో ఎదురయ్యే సమస్యల్లో చెమటకాయలు, వాటి వల్ల వచ్చే దురద, మంట.. చాలా ముఖ్యమైనవి. వాటి నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభ్యమయ్యే ఐస్‌క్యూబ్స్‌ని ఉపయోగిస్తే చాలు.. కాటన్ లేదా మెత్తని వస్త్రంలో కొన్ని ఐస్‌క్యూబ్స్ వేయాలి. దానిని మూటలా కట్టి దాంతో సమస్య ఉన్న ప్రదేశంలో మృదువుగా అద్దుకోవాలి. తరచూ ఇలా చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
aloe vera with iceఅయితే ఐస్ క్యూబ్స్ ఎప్పుడూ నేరుగా ముఖానికి అప్లై చేయవద్దు. ఒక టవల్ లేదా కోల్డ్ కంప్రెస్ బాగా పనిచేస్తుంది. అలాగే ఐస్ ట్రేలో నీళ్లకు బదులు అప్పుడప్పుడు పాలు, టొమాటో గుజ్జు, కలబంద రసం, దోసకాయ రసం వంటి పదార్ధాలను ఉంచి వాటితో రబ్ చేయడం వలన మీ చర్మానికి అదనంగా పోషకాలు అందుతాయి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని రుద్దాలి. అంతకంటే ఎక్కువ సార్లు రుద్దితే సున్నితమైన ముఖ చర్మం మొరటుగా మారుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR