లెమన్ గ్రాస్ టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

నిమ్మకాయ ఉపయోగాలు మనకు తెలుసు. నిమ్మ కాయలు, ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ నిమ్మగడ్డి గురించి తెలుసా? దీనిని లెమన్ గ్రాస్ అని కూడా అంటారు. మ‌న దేశంతోపాటు ప‌లు ఆసియా దేశాల్లోనూ లెమ‌న్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. నిమ్మ గడ్డి అనే పేరులోనే ఉంది కనుక ఇది అచ్చం నిమ్మలాగే వాసన వస్తుంది.

lemon grassఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. లెమ‌న్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. నిమ్మగడ్డిని నేరుగా తీసుకోవడం కంటే కూడా టీ గా తయారుచేసుకొని తాగితే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి.

lemon grass teaనిమ్మగడ్డి లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యాధి కారక ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. శరీరంలోకి క్రిమి కీటకాలను దరిచేరనివ్వదు. నోటిలో ఇన్ఫెక్షన్లు రానివ్వదు. దంతక్షయానికి కారణం అయ్యే బ్యాక్టీరియా ను నివారిస్తుంది. లెమన్ గ్రాస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు లోని మంటను తగ్గిస్తాయి.

tooth decayఈ టీ నీ ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కలిగిస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీని రోజూ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. అధిక రక్తపోటు తో బాధపడేవారు దీనిని తాగటం వలన బీపీ అదుపు లోకి వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.

heart healthyఈ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు.. త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. అంతేకాదు ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది. జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి, ఇన్ఫెక్షన్స్, ఆందోళన, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలకు లెమన్ గ్రాస్ టీ చక్కగా పనిచేస్తుంది. ఈ టీ రోజు తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేసిన పరిశోధనలో నిరూపితమైంది.

cancer noఈ లెమన్ గ్రాస్ టీ తయారు చేసుకోడానికి ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం అందులో బాగా సన్నగా తరిగిన లెమన్‌ గ్రాస్‌ కాడలను వేసి మళ్లీ 5 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. తరువాత మంట తగ్గించి సిమ్మర్‌లో ఉంచి మళ్లీ 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టవ్‌ ఆర్పి టీని కిందకు దించి దాన్ని వడకట్టాలి. ఆ టీలో తేనె కలుపుకుని వేడిగా ఉండగానే తాగేయాలి. తేనె అవసరం లేదనుకుంటే నేరుగా కూడా తాగవచ్చు. లేదా చక్కెర, బెల్లం కూడా కలుపుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR