మన ఇంట్లో సాలెపురుగులు గూడు నిర్మించడం వల్ల ఎదురయ్యే సమస్యలు!!!

దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో మనం ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల లేదా కొన్ని వస్తువుల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు.

demonsఅయితే కొన్ని వస్తువులు పలాన చోటే ఉండాలని మనకు వాస్తు శాస్త్రం చెప్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాస్తు శాస్త్రం ఆధారంగా కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాం. ఇలా నిర్మించుకున్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతుంటారు.

new houseఅయితేకొన్ని మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో దుష్ట శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో మానసిక ప్రశాంతత దూరం అవ్వడమే కాకుండా, అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మరి మనం చేసే ఆ చిన్న తప్పు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

moneyకుటుంబంలో ఎవరూ కూడా బారెడు పొద్దెక్కిన దాకా నిద్ర పోకూడదు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబంలో కలహాలు, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

tensionమన పూజ గదిలో ఉన్న విగ్రహాలు, చిత్రాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన నెయ్యితోచేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితాలు కలిగి ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది.

ghee lampఅంతేకాకుండా దేవుని గదిలో విలువైన వస్తువులను దాచిపెట్టడం ద్వారా మన ఇంట్లో సిరి సంపదలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మన ఇంటి ప్రధాన ముఖ ద్వారం దక్షిణం వైపు ఉండకూడదు.
అలా ఉండడం వల్ల ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుంది. ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి వినాయకుడి చిత్రాన్ని ముఖద్వారంపై పెట్టాలి.

spider webఇలా చేయడం ద్వారా దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో ఎవరు గొడవ పడుతూ అన్నం విసిరేయడం వంటి పనులు అసలు చేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావడం వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంట్లో సాలెపురుగులు గూడు నిర్మించడం వంటివి అస్సలు ఉండకూడదు. సాలెగూడు రాహువు ప్రభావం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ మంగళవారం శుక్రవారం సమయాలలో ఇంట్లో బూజు శుభ్రం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR