ఎంత ప్రయత్నిచిన బరువు తగ్గట్లేదా… తప్పు మీది కాదు, ఇవి తెలుసుకోండి?

అధిక బరువు అనేది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాల సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి బరువుని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అధిక బరువు సమస్య నుంచి బయట పడేందుకు సాధారణంగా చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. అయినా బరువు మాత్రం తగ్గట్లేదని చెబుతుంటారు. ఎంత కఠిన వ్యాయామాలు చేసినా… ఇష్టమైన పదార్థాలు తినకుండా నోరు కట్టేసుకున్నా ఫలితం ఉండడం లేదా? అయితే బరువు తగ్గడంలో మీ ప్రయత్న లోపమేమీ లేదు.

fatఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మనం చేసే వ్యాయామం, ఫుడ్ డైట్ తో పాటు రోజూ తగినన్ని గంటల పాటు నిద్ర కూడా అవసరం. నిద్ర సరిగ్గా పోకపోయినా బరువు పెరుగుతారు. కనుక మీరు సరిపోయేంత నిద్ర పోతున్నారా, లేదా.. అనే విషయాన్ని గమనించండి. ఈ సమస్యను పరిష్కరించుకుంటే బరువు తగ్గడం సులభతరం అవుతుంది.

good sleepరోజూ వ్యాయామం చేస్తున్నాం కదా అని చెప్పి కొందరు జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. అలా చేయకూడదు. వీటి వల్ల కొవ్వు పెరుగుతుంది. బరువు తగ్గడం కష్టమవుతుంది. కనుక వీటికి బదులుగా నట్స్, విత్తనాలు, పండ్లను తింటే మేలు. బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. అధిక క్యాలరీలు ఇచ్చే ఆహారాలను కూడా రోజూ చాలా మంది తింటుంటారు. వీటిని కూడా మానేయాల్సి ఉంటుంది. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. చక్కెర, ఇతర తీపి పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను రోజూ తింటే బరువు పెరుగుతారే తప్ప తగ్గరు. కనుక వీటిని మానేయాలి. దీంతో బరువు తగ్గడం తేలిక అవుతుంది.

sweets and donutsమనం రోజూ తినే ఆహారాల్లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఫైబర్ తగినంత లభించకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది. కనుక ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తినాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. రోజూ తగినంత మోతాదులో నీటిని తాగకపోయినా బరువుపై ప్రభావం పడుతుంది. బరువు తగ్గరు. కనుక రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని అయినా తాగాల్సి ఉంటుంది. కొందరు అధికంగా వ్యాయమం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. శరీరానికి తగినంత మాత్రమే వ్యాయామం చేయాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.

plenty of waterఈ నియమాలన్నీ పాటించినా సరే బరువు తగ్గట్లేదు అంటే దానికి కారణం పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు. మన పేగుల్లో ఉండే కొన్ని సూక్ష్మజీవులే బరువు తగ్గడాన్ని అడ్డుకుంటున్నాయి. లోపలకు వెళ్లిన ఆహారాన్ని శరీరం శోషించుకోవడంలో పేగుల్లోని మైక్రో బయోమ్ అనే సూక్ష్మజీవులదే కీలకపాత్ర. ఈ మైక్రోబయోమ్లో తేడా వల్లే ఊబకాయం పెరిగిపోతోందని పరిశోధకులు చెప్తున్నారు. మన ఆరోగ్యంలో సూక్ష్మజీవులు కీలకపాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం ఎంత వయసు కలిగి ఉన్నా శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుండాలి. అయితే స్థూలకాయం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని సూక్ష్మజీవులు ప్రభావితం చేస్తాయి.

diabetes type 2మనం తినే ఆహారాన్ని మన శరీరమంతా ప్రయోజనాలను కలిగి ఉండే సమ్మేళనాల శ్రేణిగా మైక్రోబయోమ్ మారుస్తుంది. మన శరీరంలో సూక్ష్మజీవులు వివిధ రకాల విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి. జీవక్రియ, మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరోటోనిన్ వంటి హార్మోన్లు మన శరీరంలో విడుదలవుతాయి. మనం తినే ఫైబర్ను పులియబెట్టి దానిని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్గా మార్చడం ద్వారా కడుపులో మంటను తగ్గించవచ్చు. సాధారణంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ‘ఎసిటేట్’ అనే రసాయనం ఎక్కువగా విడుదలవుతోందట. ఇది క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్ను ఎక్కువ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తున్నాయట. అలాగే ఈ రసాయనం గ్యాస్ర్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తోందట.

stomach acidity or fireఈ హార్మోన్లు అధిక కొవ్వు పదార్థాలను తినేలా మానవ మెదడును ప్రేరేపిస్తాయట. కాగా, ఈ ఎసిటేట్కు, ఇన్సులిన్ అధిక ఉత్పత్తికి, పేగుల్లోని సూక్ష్మజీవులకు ఏదో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆహారం తీసుకునే ప్రక్రియలో తేడా రాగానే అంటే డైటింగ్ వంటివి చేయడం మొదలెట్టగానే పేగుల్లోని ఈ సూక్ష్మజీవులు ‘ఎసిటేట్’ ఎక్కువ విడుదలయ్యేలా ప్రేరేపిస్తున్నాయట. ఈ ‘ఎసిటేట్’ ఆనారోగ్యకర ఆహారాన్ని తీసుకునేలా ప్రేరేపించడంతోపాటు ఇన్సులిన్ ప్రతిబంధకతను, ఊబకాయాన్ని పెంచుతోందట. అందుకే ఎంత ప్రయత్నించినా కొంతమంది బరువు తగ్గలేరు. అందువల్ల మైక్రోబయోమ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR