కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా పొరపాటున కూడా ఆ పని చేయకండి!

ఇదువరకటి రోజుల్లో మట్టి పాత్రల్లో వండుకొని తినేవారు. రాగి పాత్రల్లో నీళ్లు తాగేవారు. అందుకే ఎన్నేళ్లొచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం వంటశాలలో ఆ పాత్రల స్థానాన్ని ఎలక్ట్రిక్ వస్తువులు ఆక్రమించేశాయి. ఈ రోజుల్లో వేడినీళ్ల దగ్గర్నుంచి, తాగే నీరు, తినే తిండి కూడా కరెంట్ ద్వారా తయారవుతున్నాయి. ఇండక్షన్ స్టవ్, ఎలక్టిక్ కుక్కర్ ఇలా అనేక వస్తువులను వాడేస్తున్నారు. తాగే నీరు కూడా వాటర్ హీటర్‌లో వేడి చేసుకుంటున్నారు. అలాగే, అన్నం రైస్ కుక్కర్‌లోనే వండేస్తున్నారు. ఇవన్నీ కలిపి మనుషుల ఆరోగ్యానికి హానికరం గా తయారయ్యాయి .

rice ganjiఒకప్పుడు బియ్యాన్ని పాత్రలో నీళ్లు వేసి ఉండికించి వార్చేవారు. అందులో ఉండే నీరు (గంజిని) వంచేసి అన్నాన్ని తయారు చేసేవారు. అయితే, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెజర్ కుక్కర్లు ఉంటున్నాయి. వీటిని కొందరు కేవలం కర్రీ చేయడానికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు అందులో అన్నం కూడా వండేస్తుంటారు. పైగా ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం సులభమే కాకుండా.. అన్నం పాడవుతుందనే బెంగ కూడా ఉండదు. విజిల్స్ లెక్క పెట్టుకుని స్టవ్ కట్టేస్తే చాలు అన్నం రెడీ అయిపోతుంది. పనిగట్టుకుని పాత్రను వంచి గంజిని వేరు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఎక్కువ మంది ప్రెజర్ కుక్కర్లో అన్నాన్ని వండటానికే ఎక్కువ ఇష్టపడతారు.

riceఅయితే ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. ఆహారం ఉడికేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. ఇలా తగలక పోతే వండిన ఆహారం విషంగా తయారవుతుంది. ఈ విషాలలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి తక్షణమే పనిచేస్తుంది. దీన్ని ఫుడ్ పాయిజన్ అని అంటారు.రెండవది శరీరంలోకి చేరిన కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విష ప్రభావం బయట పడుతుంది. ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్‌లో అన్నం వండుతున్నప్పుడు గాలి వెళ్లే అవకాశం అసలు ఉండదు. దీంతో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

sugar levelsరైస్ కుక్కర్‌లో వండుకున్న అన్నం విషం తో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కుక్కర్ లో వండిన ఆహరం తినడం వలన గుండె సంబంధిత జబ్బులు, ఉదర సంబంధ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి, కీళ్ల వాతం, షుగరు, గ్యాస్ సమస్యల వంటి రోగాల బారిన పడతారు అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది పాత్రలో ఉడికించిన అన్నాన్ని తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. పాత్రలో ఉడికించే అన్నం పదునుగా, చూడచక్కగా ఉంటుందని, ముద్ద కాదని అంటారు. పైగా, అన్నం నుంచి వచ్చే గంజి ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా అంటారు.

riceబియ్యంలో ఉండే పోషకాలన్నీ గంజిలోకి చేరతాయని, అది తాగితే బోలెడంత శక్తి వస్తుందని చెబుతారు. ఇది కూడా వాస్తవమే. కానీ, ఈ రోజుల్లో ఎవరూ గంజిని తాగడం లేదు. ఒకప్పుడు నిమ్మకాయ, కాస్త ఉప్పు వేసుకుని ఎనర్జీ డ్రింక్‌గా తాగేవారు. రోజంతా ఉత్సాహంగా పనిచేసేవారు. కొంచెం ఓపికతో బియ్యం కడిగి పెట్టుకుని వండుకోవటం ఉత్తమం అని అంటున్నారు. వండటం త్వరగా పూర్తి అవడం కన్నా… ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అని గుర్తు చేస్తున్నారు.

రైస్ కుక్కర్ లో అన్ని అల్యూమినియంతో తయారయినవే ఉంటాయి. అల్యూమినియం పాత్రలలో వంట చేయడం, చేసిన వంట ను వాటిలో నిల్వ చేయడం అసలు మంచిది కాదు. అదీకాక ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించే అన్నంతో పోల్చితే పాత్రలో ఉడికించే అన్నంలో కెలోరీల శాతం తక్కువ.100 గ్రాముల బాయిల్డ్ రైస్‌లో 130 కెలోరీలు ఉంటే.. కుక్కర్‌లో ఉడికించే అన్నంలో 151 కెలోరీలు ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్లడించింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR