బ్రష్ చేసేటప్పుడు నాలుకను శుభ్రం చేయకపోతే ఈ సమస్యలు తప్పవు!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే బాహ్య పరిశుభ్రత ఎంత ముఖ్యమో నోటి శుభ్రత కూడా అంతే ముఖ్యం. అలాగే నోటిని శుభ్రం చేసుకోవడం ఎంత అవసరమో.. నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా అంతే అవసరం. నాలుక శుభ్రంగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. నోరు ఫ్రెష్ గా ఉండటం వల్ల ఆహారం రుచికరంగా ఉంటుంది. నోటిని శుభ్రం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

బ్రష్ చేసుకోవడం, నోరు కడుక్కోవడం వల్ల క్యావిటీస్, చిగుళ్ల సమస్యలు రావని అందరికీ తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో నాలుకను శుభ్రం చేసుకోవడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా సందర్భాల్లో పళ్లు క్లీన్ చేయడంలో చూపించే శ్రద్ధ నాలుక శుభ్రపరచడానికి చూపించరు. దీనివల్ల.. చాలా సమస్యలు ఎదురవుతాయి. నాలుక శుభ్రంగా ఉంటే.. మాట్లాడటంలో క్లారిటీ ఉంటుంది, గొంతులో కిచ్ కిచ్ లాంటి సమస్యలుండవు.

brushingమన నోటి లోపల… సరిపడా బ్యాక్టీరియా తయారవుతుంటే, వయసుతో సంబంధం లేకుండా మీరు యంగ్‌గా కనిపిస్తారు. ప్రతి రోజు నాలుకను శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు కొత్తగా బ్యాక్టీరియా మళ్లీ పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా నైట్రిక్ యాసిడ్‌ ఉత్పత్తిని పెంచుతుంది. అది నోటిలోని లాలాజలం లోకలిసి అది వయసును పెరగనివ్వకుండా కాపాడుతుంది.

teeth problemనాలికను గీసి పాచిని శుభ్రం చేసుకున్నప్పుడు అక్కడ ఉండే చెడు పదార్థాలు, అతుక్కుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో… ఆ ప్రాంతం శుభ్రంగా ఉండి మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశంగా ఉంటుంది. 50 శాతం నైట్రిక్ యాసిడ్ నాలిక ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. ముసలితనం త్వరగా రాకుండా చెయ్యడంలో నాలుక ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు నిపుణులు.

మనం బ్రష్ చేసుకున్నప్పుడు బ్రష్ నాలుక పైన ఉన్న వ్యర్థాలను తొలగించలేదు. నాలుక కోసం కచ్చితంగా టంగ్ క్లీనర్ ఉపయోగించాల్సిందే. వీలైనంత డీప్ గా నాలుకను శుభ్రం చేసుకోవడం మంచిది అని తెలియచేస్తున్నారు. ఐతే… టంగ్ క్లీనర్ గొంతులోకి వెళ్లిపోకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

tongue cleanerఏది తిన్నా కారం, ఉప్పు, పులుపు, తీపి వంటి రకరకాల రుచులను తెలిపుతుంది నాలుక. సగటున ప్రతి ఒక్కరికి 10 వేల టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండు వారాలకు రీప్లేస్ అవుతూ ఉంటటాయి. ఒకవేళ నాలుకను సరిగ్గా శుభ్రపరచకపోతే.. టేస్ట్ బడ్స్ బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల టేస్ట్ తెలియక ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పుని, చక్కెరను కలుపుకుని తింటారు.

teeth problemనోటిలో ఉండే బ్యాక్టీరియా సృష్టించే నైట్రేట్స్ ఉమ్మి ద్వారా పొట్ట లోకి వెళ్లి నైట్రిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ యాసిడ్ కణాన్ని ముసలిదానిగా మారకుండా చేస్తుంది. దాంతో వయసు పెరగదని సైంటిస్టులు చెబుతున్నారు. వయసు పెరగకుండా ఉంచే శక్తి నాలికకు ఉందని తెలుస్తుంది.

heart problemజీర్ణప్రక్రియ నోటి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి నోట్లో లాలాజలం ఊరడం ద్వారానే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల సాలివాను ఉత్పత్తి చేసి.. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోరు డ్రైగా మారకుండా సహాయపడుతుంది.

నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నాలుకపై ఏర్పడే తెల్లటి పొర, ఫంగస్ కారణంగా శరీరంలో చాలా సమస్యలకు కారణమవుతాయి. నాలుకను సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల గొంతులో వచ్చే ఫ్లమ్ ని, బ్యాక్టీరియాను బయటకు పంపవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు. రెగ్యులర్ గా నాలుకను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

bloodనోటి ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు ఇటీవలే తేలింది. నోట్లో ఉండే ఫలకం హార్ట్ ఎటాక్, స్ర్టోక్ కు కారణమవుతాయి. దీని కారణంగా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి నొప్పులకు దారితీస్తాయి. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

taste budsశ్వాస సంబంధిత వ్యాధులకు దూరంగా
నాలుకను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. లంగ్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు. శ్వాస ఆరోగ్యంగా ఉండటానికి ఈ ప్రక్రియ సహకరిస్తుంది.

గర్భణీలలో వ్యాధినిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీరి నోట్లో బ్యాక్టీరియా చాలా త్వరగా ఏర్పడుతుంది. అలాగే నాలుక శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా ఏర్పడుతుంది. దాంతో నోటి దుర్వాసన వంటి చిన్న సమస్యల నుండి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

teeth problemనాలుకను శుభ్రపరుచుకోవడానికి గంటలు గంటలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు . 5 నిముషాలు వెచ్చిస్తే చాలు. టంగ్ క్లీనర్, టంగ్ బ్రెష్ తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. నోరు శుభ్రపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR