ఘాటుగా ఉంటుందని గరం మసాలాని పక్కన పెట్టేస్తున్నారా ?

ప్రపంచంలోనే మన భారతీయ వంటకాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వెజ్ నుంచి.. నాన్ వెజ్ వరకూ ఏ వంట వండినా అన్ని ఘుమఘుమాలాడాల్సిందే. అయితే.. కూరల్లో ప్రత్యేక సువాసన, రుచి కోసం గరం మసాలాను జతచేస్తారు. గరం మసాలా వేసిన తర్వాత వచ్చే సువాసనే వేరు. అందుకే ప్రతిఒక్కరి వంటగదిలో సాధారణంగా సుగంధ ద్రవ్యాల మిశ్రమం గరం మసాలా కచ్చితంగా ఉంటుంది. ధనియాలు, ఏలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఆవాలు, లవంగం, ఫెన్నెల్, మిరియాలు, మెంతుల సమ్మేళనంతో తయారు చేసిందే గరం మసాలా. ఈ గరం మసాలా కేవలం రుచి, సువాసన కోసమే అనుకుంటే పొరపాటే. దీనివల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

garam masalaఅయితే దుకాణం నుంచి కొనుగోలు తెచ్చిన దాని కంటే ఇంట్లో సొంతంగా తయారుచేసుకున్న గరం మసాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ గమనించవల్సింది ఏంటంటే… గరం మసాలా తయారీలో వాడే పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, ఆయా ప్రాంతాలు, ప్రజల రుచులు, అభిరుచులను బట్టే ఉంటుంది. ఈ గరం మసాలాలో అనేక పోషకాలు, ఖనిజాలు దాగి ఉన్నాయి. వర్షాకాలం, చలికాలంలో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు మామూలే. ఈ సీజన్లో గ‌రం మ‌సాలా పొడిని ఉప‌యోగించి వంట‌ల‌ను చేసుకుని తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గ‌రం మ‌సాలాలో ఉండే దినుసుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల వాపులు, నొప్పులు త‌గ్గుతాయి.

blood pressureఆయుర్వేదం ప్రకారం శరీరంలో వేడిని పుట్టించే సామర్థ్యం కలదే గరం మసాలా. సరైన మొత్తం ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే జీర్ణం అయ్యేలా, అందుకు అనుగుణంగా గరం మసాలా వాడాల్సిన అవసరం ఉన్నదని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. గరం మసాలా శరీరంలో వేడితోపాటు జీవన ప్రక్రియను పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. లవంగాలు, జీలకర్ర శరీరంలో ఎసిడిటీ, అజీర్తిని తగ్గించడానికి సహకరిస్తాయి. మిరియాలు, ఏలకులు కూడా జీర్ణ శక్తి మెరుగుదలకు దోహదపడతాయి.

digestionలవంగాలు, మిరియాలు, ఏలకులు, దాల్చిన చెక్క మనిషి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేస్తాయి. దాల్చిన చెక్క 2 టైప్ మధుమేహం, బ్లడ్ షుగర్‌ను తగ్గించి వేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం పెంపుదలపాటు క్యాన్సర్ నిరోధక సామర్థ్యం పెరుగుదలకు దోహద పడుతుంది. ధనియాలు సైతం రక్తంలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి. గరం మసాలా వల్ల కలిగే ప్రయోజనాల్లో మలబద్ధకం నివారణ ఒకటి. గరం మసాలా వాడటంతో సమర్థవంతంగా జీర్ణ శక్తి నడవడానికి సహకరిస్తుంది. తద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగించి వేస్తుంది.

garam masalaఈ మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు కేలరీలను కరిగించి.. బరువును తగ్గించడంలో సాయపడతాయి. అందుకే గరం మసాలాను ఆహారంలో చేర్చి ఎక్కువ కేలరీలను బర్న్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గరం మసాలా గుండె ఆరోగ్యంగా ఉండేలా ఉపయోగపడుతుంది. గరం మసాలాలో ఉపయోగించే యాలకులు గుండె సమస్యలను నివారించడంలో సాయపడతాయి. దీంతోపాటు మీ రక్తపోటు స్థాయిలను (బీపీ) కూడా సులువుగా నియంత్రణలోకి వస్తుంది. గరం మసాలా క్యాన్సర్ కారకాల ప్రమాదాలను తగ్గిస్తుంది. దీంతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యల నివారణ విషయంలో గరం మసాలా దివ్యఔషధంగా పనిచేస్తుంది. మసాలా దినుసుల్లోని పోషకాలు శరీరంలో కణితుల పెరుగుదలను నిరోధిస్తాయి.

virusలవంగాలు, ఏలకుల వాడకం వల్ల చెడు శ్వాసపై పోరాటం తేలికవుతుంది. లవంగాలు ప్రత్యేకించి దంతాల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. దంతాల నొప్పులను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు కాల్షియం, విటమిన్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లవంగాల్లో పుష్కలంగా ఉన్నాయి. వృద్ధాప్యం ప్రక్రియను తగ్గించడంలో గరం మసాలా శక్తివంతంగా పని చేస్తుంది. దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర వాడకంతో మరింత బలోపేతం అవుతుంది. మిరియాలు ప్రత్యేకించి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్‌గానూ, యాంటీ బయాటిక్స్‌కు నిలయంగా వృద్ధాప్యం ప్రక్రియను తగ్గించి వేస్తుందని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు.

accidityఅయితే.. గరం మసాలా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా ఉపయోగించకూడదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాని వ‌ల్ల పైల్స్, గుండెల్లో మంట‌, అసిడిటీ, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు వస్తాయి. క‌నుక ఆ పొడిని రోజూ మోతాదులో వాడుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR