శరీరంలో ఆక్సిజన్ పెంచే ఆహారాలు ఇవే!

కరోనా రెండో వేవ్ లో అత్యధిక మరణాలకు కారణం ఆక్సిజన్ లేకపోవడం. రోజువారీ ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కేవలం కరోనా వైరస్ మాత్రమే కాదు శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరంలో ఆక్సిజన్‌ను సహజంగా పెంచడం ఎంతో అవసరం. ఆక్సిజన్‌ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్‌ బ్లడ్‌ సెల్స్‌ లోని ప్రధాన ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్‌ ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్‌ ను వెనక్కు తీసుకొని వస్తుంది.

oxygenఈ ఆక్సిజన్‌ కణాల్లో శక్తిని తయారుచేసేందుకు తోడ్పడుతుంది. అందుకే శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్‌ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్‌ తగినంత పాళ్లలో మెయింటెయిన్‌ చేయాలంటే కాపర్‌, ఐరన్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ2 (రైబోఫ్లెవిన్‌), విటమిన్‌ బీ3 (నియాసిన్‌), విటమిన్‌ బీ5, విటమిన్‌ బీ 6, ఫాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ12 తీసుకోవడం తప్పనిసరి. ఈ విటమిన్లు ఏ ఆహారంలో లభిస్తాయో తెలుసుకొని తీరాల్సిందే.

haemoglobinపుచ్చకాయ ఉపయోగం గురించి మనకు తెలిసిందే. ఇందులో ఆల్కలైన్ తో పాటు ph కూడా 9 కంటే ఎక్కువ ఉంటుంది అనే చెప్పాలి. ఇది తింటే… శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా వేగంగా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే పుచ్చకాయని ప్రాణదాత అని కూడా అనవచ్చు. అంత బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలు కూడా అందరికీ ఇంట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా ఆక్సిజన్ పెంచుతాయి. నిమ్మరసం తాగడం వలన మెదడు కణాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. వీటిలో పొటాషియం సంవృద్ధిగా దొరుకుతుంది. ఇది మనల్ని ఉత్సాహం గా ఉండేలా చేస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక ఇబ్బంది పడేవారు తాజా నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

water melonఅలాగే చిలగడదుంప కూడా ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు.చిల‌గ‌డ‌దుంప‌లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి మిన‌ర‌ల్స్ మ‌రియు ప్రోటీన్స్ అనేక జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంతో పాటు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను కూడా పెంచుతుంది. దోస‌కాయ తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది. దోస‌కాయ‌లో వాట‌ర్ కంటెంట్‌తో పాటు కొన్ని ముఖ్య‌మైన పోష‌కాలు ఉండ‌టం వ‌ల్ల‌. ర‌క్తంలో ప‌డిపోయిన ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ మ‌ళ్లీ పెరుగుతాయి.

sweet potatoవిటమిన్‌ బీ6, బీ9 ఆర్గాన్‌ మీట్‌ (లివర్‌), కోడిమాంసం, టూనా చేప తదితరాలతోపాటు అరటిపండు, పాలకూర, బ్రసెల్స్‌ మొలకల్లో పుష్కలంగా లభిస్తాయి. సహజంగా శాకాహారంలో విటమిన్‌ బీ12 లభించదు. కానీ.. బ్లాక్‌ ట్రంపెట్‌, గోల్డ్‌ శాన్‌ట్రెల్‌ అనే పుట్టగొడుగులో లభిస్తుంది. సముద్ర కూరగాయలైన గ్రీన్‌ లావెర్‌, పర్పల్‌ లావెర్‌లోనూ లభిస్తుంది. విటమిన్‌ బీ2 (రైబోఫ్లెవిన్‌) అనేది కోడిగుడ్లు, ఆర్గాన్‌ మీట్‌ (కిడ్నీ, లివర్‌), పాలు తదితరాల్లో అధిక పాళ్లలో ఉంటుంది. 90 గ్రాముల లివర్‌ తీసుకుంటే రోజుకు కావాల్సిన రైబోఫ్లెవిన్‌లో 223% పొందవచ్చు. ఓట్స్‌, పెరుగు, పాలు, బాదాం, పనీర్‌, పొట్టుతో కూడిన యాపిల్‌, బీన్స్‌, సన్‌ఫ్లవర్‌ గింజలు, టమాట తదితరాలు తీసుకున్నా రైబోఫ్లెవిన్‌ లభిస్తుంది.

sunflower seedsకూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. బీన్స్, ఆలుగడ్డలు, పచ్చి బఠానీల నుంచి కూడా ఐరన్ లభిస్తుంది. టమాటా, బ్రొకొలి, పిస్తా, బాదం పప్పు, మటన్ లివర్, పల్లీల ద్వారా కూడా ఐరన్ ను పొందవచ్చు. కొత్తీమీర, అవకాడో, కోడిగుడ్లు, యాపిక్రాట్స్ లలో కూడా ఐరన్ ను పొందవచ్చు. ఈ ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య దూరం కావడంతో పాటు అవయవాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది.

brocoliఆకు కూర బచ్చలిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆక్సిజన్‌ను శరీరమంతా అందేలా చేస్తుంది. తద్వారా మెదడు కండరాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి బచ్చలి కూర తినడం వలన ఆక్సిజన్ అందుతుంది. బ్రకోలీ కూడా ఇలానే పనిచేస్తుంది. బ్రకోలీ లో విటమిన్లు, ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ సేపు ఆక్సిజన్ వచ్చేలా చేయగలవు .శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం వలన మనం చక్కగా ఉంటాం. కివి పండ్లు కూడా ఆక్సిజన్‌ను పెంచడంలో బాగా పనిచేస్తాయి. ఏ పండ్లలో లేనన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది కణాలను నాశనం చేసే విష వ్యర్థాలను కివీ పండ్లు అంతం చేసి… రక్తంలో ఆక్సిజన్ సప్లై పెరిగేలా చేయగలవు.

green vegetablesపప్పులు, గింజలు, బద్దలు ఇవన్నీ లెగ్యూమ్ జాతి గా చెప్పబడతాయి. వీటిలో లెఘ మో గ్లోబిన్ ఉండి ఇది ఆక్సిజన్‌ను మోసుకెళ్తుంది. కాబట్టి ఈ గింజలు ఆహారం లో తినడం మొదలు పెట్టి ఆక్సిజన్ సమస్య తగ్గించుకోండి. పైనాపిల్ , ద్రాక్ష పండ్లు, కిస్‌మిస్, పియర్స్, ఇవితిన్నాకూడా ఆక్సిజన్ బాగా అందుతుంది. ముఖ్యంగా పైనాపిల్ చాలా బాగా పనిచేస్తుంది. వీటిని వీలైనంతగా ఆహారం లో ఎక్కువగా తింటూ ఉండడం వలన శరీరం ఆక్సిజన్‌ను బాగా పొందుతుంది. అయితే పైన్ఆపిల్ గర్భిణీలపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది గర్భసంచి ముడుచుకు పోయేలా చేస్తుంది కాబట్టి.. గర్భంతో ఉన్న స్త్రీలు ఈ పండును తినకపోవడమే మంచిది .

dosakayaఆర్గాన్‌ మీట్‌ (లివర్‌), చికెన్‌, టూనా చేప, కోడిగుడ్లు తదితర మాంసాహార పదార్థాల్లో విటమిన్‌ బీ5 అధికంగా లభిస్తుంది.
90గ్రాముల ఆర్గాన్‌ మీట్‌లో రోజువారీ అవసరాల్లో 166% వరకు విటమిన్‌ బీ5 లభిస్తుంది. పుట్టగొడుగులు, పొద్దు తిరుగుడు గింజలు, ఆలుగడ్డ, పెసరపప్పు, బ్రౌన్‌రైస్‌, బ్రోక్లీ, ఓట్స్‌, పనీర్‌ తదితరాల్లో 8-52శాతం వరకు విటమిన్‌ బీ5 లభిస్తుంది. విటమిన్‌ ఏ కూడా ఐరన్‌ వంటిదే. మాసంలోని లివర్‌ భాగం, గుడ్లు తగినంతగా తీసుకోవడం ద్వారా ఇది లభిస్తుంది.
సుమారు 90గ్రాముల మాంసంతో రోజువారీ అవసరాల్లో 444% విటమిన్‌ ఏ లభిస్తుంది. గణుసుగడ్డ, క్యారెట్‌, ఆనిగెకాయ, మామిడి పండు, పాలకూర, బీట్‌రూట్‌ తదితరాల్లోనూ విటమిన్‌ ఏ లభిస్తుంది. వెనీలా ఐస్‌క్రీమ్‌లో కూడా విటమిన్‌ ఏ ఉంటుంది. అరకప్పు క్యారెట్‌ తీసుకుంటే రోజువారీ అవసరాల్లో 184% విటమిన్‌ ఏ లభిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR