పిల్లల చెవుల విషయంలో తప్పక పాటించవలసిన విషయాలు!

పసి బిడ్డల సంరక్షణ కష్టమైన పనే అని చెప్పాలి. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువేమి కాదు. చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. కాబట్టి ఏం చేసినా ఆచి తూచి చేయాల్సి ఉంటుంది. శిశువు అధికంగా ఏడుస్తుంటే కనుక, వారు ఏడుస్తూనే చేతులు కదల్చడం లేదా రుద్దడం వంటివి చేస్తూ మనకు సూచనలిస్తారు. వాటిని కనుక మనం గమనించినట్లైతే సమస్య పరిష్కరించడం చాలా సులభం. ఇక పిల్లల చెవుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు కొత్త శబ్దాలకు అలవాటు పడటం మొదలు పెడతారు. ఆ క్రమంలోనే వారు కొన్ని చిన్నచిన్న లేదా పెద్ద పెద్ద శబ్దాలకు కెవ్వు మంటుంటారు.

kid cryingపాలు పట్టేటప్పుడు వారు చెవులను లాగడం లేదా చెవుల పట్టుకొని ఏడవడం వంటివి చేస్తున్నట్లేతే..చెవులకు ఇన్ఫెక్షన్ అయిందేమోనని గమనించాలి. సామాన్యంగా పిల్లల చెవులను శుభ్రం చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా బేబీ యొక్క చెవులకు హాని కలుగుతుంది. అది ఇతర ఇన్ఫెక్షన్స్ కు కారణం కావచ్చు.
చిన్నపిల్లల్లో చేవులు శుభ్ర చేయడం వల్ల చెవిలో గుబిలి తొలగించడం మాత్రమే కాదు, చెవిలో ముడుతలు ఏర్పకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం కూడా ముఖ్యమే. చిన్న పిల్లల చెవులను శుభ్రపరచడానికి అదనపు సంరక్షణ, సహనం కలిగి ఉండటం చాలా అవసరం.

ఇక పిల్లల చెవులు శుభ్రం చేయడానికి సొంత టెక్నిక్స్ ఉపయోగించడం మంచిది కాదు. పిల్లల ముక్కు, చెవులలో నూనెను పోయకూడదు, ఇది ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. బేబీ చెవులను శుభ్రపరచడానికి స్నానం చేయించే సమయం చాలా మంచిది. బేబీ యొక్క చెవులు తేమగా ఉన్నప్పుడు చెవులను శుభ్రం చేయడం మరింత సులభం అవుతుంది. ఒక తడి వస్త్రాన్ని తీసుకొని చెవి భాహ్యభాగంను శుభ్రం చేయండి . తర్వాత చెవిలోపలి వైపు, ఒక పొడి వస్త్రంతో శుభ్రం చేయండి. ఇలా రెగ్యురల్ గా చేయాలి. ఇది చెవిలోపల చేరిన అన్ని డెడ్ సెల్స్ మరియు గుబిలిని తొలగిస్తుంది. బేబీ చెవులు పొడిగా ఉన్నప్పుడు శుభ్రం చేయడానికి ప్రయత్నించకండి. అది స్కిన్ ఇరిటేషన్ మరియు స్ర్కాచెస్ కు కారణం కావచ్చు.

kid ears painవీటితో పాటు పిల్లలు చెవుల సంరక్షణలో భాగంగా చెవులు కొట్టించడం కూడా చాలా ముఖ్యమైన అంశం అనే చెప్పాలి. చెవులు కుట్టించే ముందు తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పిల్లలకు చెవులు కుట్టించే ముందు కచ్చితంగా తలస్నానం చేయించాలి. ఆచెవులు కొట్టించిన తర్వాత ఒక వారం గడిచే వరకు మాత్రం చెవులపై చుక్క నీళ్ళు కూడా పడకుండా చూసుకుంటూ స్నానం ముగించాలి. స్టడ్స్ లేదా చిన్న చిన్న రింగులు లాంటివి కుట్టిస్తే నొప్పి లేకుండా ఉండడం తో పాటు చెవి రంధ్రం కూడా పెద్దవి అవుతాయి.

bathing kidపిల్లలకు చెవులు కుట్టించిన తర్వాత రెండు మూడు రోజుల పాటు టీ షర్ట్, స్వెట్టర్స్ అలాంటి, తలపై నుంచి వేసే ఏ డ్రెస్ కూడా వేయకుండా ఉండడం మంచిది. చేతులు తొడిగి గుండీలు పెట్టేవి అయితే అన్ని విధాలా మంచిది. అలాంటి బట్టలు వేయడం వలన అవి చెవుల దగ్గర పట్టేసి నొప్పి రావడం వంటివి లేకుండా ఉంటుంది. చిన్న పిల్లలకు చర్మం చాలా సున్నితంగా ఉండడం వలన వారికి చెవులు చీము పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దూదితో మృదువుగా తుడిచి కొబ్బరి నూనెతో నెమ్మదిగా మర్దన చేయడం వలన సమస్య తీవ్రమవకుండా ఉంటుంది.

kid cryingమరీ పసిపిల్లలు అయితే వాళ్లకు తెలియకుండానే చెవులకు పెట్టిన వాటిని చిరాకుతో లాగేకుంటూ ఉంటారు. ఒకవేళ బలంగా లాగేసుకుంటే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే పిల్లలను ఎత్తుకునే సమయంలో బుగ్గల మీద ముద్దు కూడా పెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన మీ ముక్కు లేదా ముఖం వారి చెవులకు తగిలి వాళ్లకి నొప్పి రావడం తో పాటుగా దురద కలిగి చెవులకు ఉన్నవాటిని లాగేసుకుంటూ ఉంటారు. పిల్లలు పడుకునే సమయంలో మెత్తని తలగడ వెయ్యాలి. అలా కాకపోతే పక్కకు తిరిగి పడుకున్నప్పుడు వాళ్ళకి నొప్పి రావడం తో పాటు బెడ్ షీట్ కి ఉన్న దారం లాంటివి చిక్కుకుని వాళ్ళు బలంగా లాగేసుకుంటే గాయం పెద్దది అవుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR