కొత్తిమీర ఆకులే కాదు కాడలు కూడా ఉపయోగకరమే!

కూర ఏదైనా చివర్లో కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. వంటలలో కొత్తిమీర ఉపయోగించడం వల్ల వంటలకు సువాసన రావడమే కాకుండా వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంటకు సువాసన, రుచితో పాటు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కొత్తిమీర  అందిస్తుంది.కొత్తిమీరలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సోడియం, విటమిన్ ఎ, బీ, సీ, వంటి పోషకాలు ఉంటాయి. కొత్తిమీరలో పోషకాలు, బెషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
  • కొత్తిమీర మన శరీరంలో రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ ను కంట్రోల్‌ చేస్తుంది.  కొత్తిమీర ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే యాక్టివేటెడ్ ఎంజైమ్‌లతో నిండి ఉన్నాయని వివిధ అధ్యయనాలు నిర్ధారించాయి. రక్తం నుండి చక్కెరను తొలగించడం. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు. కాబట్టి ప్రతిరోజు ఉదయమే కొద్దిగా పచ్చి కొత్తిమీరను కడిగి తినటం వల్ల షుగర్‌ వ్యాధి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.  ముఖ్యంగా ఎన్నో రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కొత్తిమీర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
  • కొత్తిమీరలో విటమిన్ ఎ పుష్కలంగా లభించడం వల్ల కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి కోతిమీరను తరచూ ఆహార పదార్థాల లో భాగంగా తీసుకోవటంవల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. చర్మకాంతిని పెంచడానికి కొత్తిమీర ఆకులు ఎంతగానో దోహద పడతాయి. కొత్తిమీర ఆకులను మెత్తని మిశ్రమంలా తయారు చేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మరొక టేబుల్ స్పూన్ తేనే, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహం మొత్తం ప్యాక్ మాదిరిగా వేసుకుని ఓ అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఉన్న దుమ్ము ధూళి కణాలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
  • అదేవిధంగా కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి అందులోకి, కొద్దిగా అన్నం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అంటించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా మారడమే కాకుండా చర్మం పై ఏర్పడిన మొటిమలు మచ్చలు తొలగిపోతాయి. చర్మం పై ముడతలతో బాధపడేవారు కొత్తిమీర ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి అందులోకి కలబంద జెల్ మొహానికి అంటించడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి ఎంతో యవ్వనంగా కనిపిస్తారు.
  • అయితే కొత్తిమీర వంటల్లో వాడేటప్పుడు ఆకులను తుంచి కాడలను పారేస్తుంటాం. కానీ కొత్తిమీర ఆకులను జాగ్రత్తగా కూరల్లో వేసుకొని ఆస్వాదిస్తాము. కానీ కాడలు మాత్రం చెత్తబుట్టలో చేరిపోతాయి. కానీ నిజానికి కొత్తిమిరతోనే కాకుండా కొత్తిమీర కాడలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు. కొత్తిమీర కాడలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా కొత్తిమీర తింటే ఐరన్ కుడా లభిస్తుంది.
  • చర్మ సంరక్షణలోనూ కొత్తిమీర కాడలు కీలకపాత్ర పోషిస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగేవారి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. కొత్తిమీర కాడలో సిట్రోనెలోల్ పుష్కలంగా ఉంటుంది, ఇది మన శరీరంలో సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటానికి, అల్సర్‌లకు చికిత్స చేసే గొప్ప క్రిమినాశకి. కొత్తిమీర కాడలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్ని అదుపుచేస్తుంది.
  • కొత్తిమీరలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటిఆక్సిడంట్ల వలె కూడా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు శరీరం‌లో కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించడం‌లో కూడా సహాయపడతాయి. కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా, జీర్ణక్రియ రేటుని కూడా పెంచుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గించడానికి ఈ కొత్తిమీర కాడలు ఎంతగానో ఉపయోగ పడుతుంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR