కరోనా వచ్చాక ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. ప్రతిఒక్కరు వారి ఇల్లు చాల అందంగా, చుట్టూ పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చూస్తారు. ఇంటిలో ముఖ్యంగా కిచెన్, బాత్ రూమ్ శుభ్రంగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. కానీ వారి తెలియకుండా ఇంటిలోకి వచ్చే బొద్దింకలు వల్ల సతమతమవుతుంటారు. బొద్ధింకను చూస్తూనే కొందరికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్రల దగ్గర అవి తచ్చాడితే ఇక ఆ పాత్రలను వాడాలని కూడా అనిపించదు. అలాగే బొద్ధింకాలు ఎక్కువగా కబోర్డ్స్ మరియు మురికి గుంటలు లో ఉంటాయి.
ఇళ్లల్లో బొద్దింకలు ఉంటే నిజంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తినే ఆహారం మీదకి కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి. బొద్దింకల ద్వారా ఈ కొలి బ్యాక్టీరియా వస్తుంది. అలానే సాల్మోనెల్లా కూడా ఉంటుంది కాబట్టి వీటిని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది వాటిని తరిమేందుకు కాక్‌రోచ్ కిల్లర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింకలు చనిపోయినప్పటికీ వాటిని కెమికల్స్‌తో తయారు చేస్తారు కనుక.. ఆ కిల్లర్స్ మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. కనుక బొద్దింకలను సహజసిద్ధమైన పద్ధతిలోనే వదిలించుకోవాలి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ముందు ఇంటిని శుభ్రం చేసుకోండి. ఎప్పటికప్పుడు దుమ్ము, ధూళి దులిపేయాండి. బొద్ధింకాలు ఎక్కువగా ఫుడ్ ఉన్నచోట మరియు దుమ్ము ధూళి ఉన్న ప్రదేశం లో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చెత్తని పారేయడం, ఇంట్లో దుమ్ము ధూళిని శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు ఇల్లు కడుక్కోవడం చేస్తూ ఉండాలి.
బొద్దింకలు సాధారణంగా పసుపు రంగుకు ఆకర్షితమవుతాయట. కనుక కిచెన్‌లో ఆ రంగు ఉండకుండా చూసుకోవాలి. పాత్రలు కానీ, కూరగాయలు కానీ, ఇతర వస్తువులు కానీ ఎల్లో కలర్ ఉన్నవి తీసేయాలి. దీంతో బొద్దింకలు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి. దోసకాయ ముక్కల వాసన బొద్దింకలకు పడదు. కనుక కిచెన్‌లో వాటిని అక్కడక్కడ ఉంచితే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు. దోసకాయలు ఎండబెట్టి ఆ ఎండిన ముక్కలను కబ్ బోర్డులలో పెట్టిన బొద్దింకల వ్యాప్తి తగ్గుతుంది.
ఇంటిలో ఎల్లప్పుడు అందుబాటులో వెల్లుల్లితో బొద్దింకలను తరిమేయ్యోచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి సింక్ వాటర్ వెళ్లే దగ్గర పెట్టండి ఘాటు వాసనకు బొద్దింకలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అంతే కాదు సింక్ నుండి వచ్చే దుర్వాసన కూడా తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లి కాకుండా నిమ్మ రసం సింక్ హోల్ దగ్గర పిండిన, లేదా కోసిన నిమ్మ చెక్కలు ఉంచిన కూడా బొద్దింకలు పెరుగుదల ఉండదు.
బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింకలు వచ్చే చోట చల్లితే.. బొద్దింకలు ఇన్‌ఫెక్షన్‌తో చనిపోతాయి. బోరిక్ పౌడర్, చక్కెర పొడి, మొక్కజొన్ని పిండిలను సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచాలి. ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయి.
సబ్బు నీళ్లను బొద్దింకలపై పోస్తే అవి వెంటనే చనిపోతాయి. బొద్దింకల నియంత్రణకు మరో హోమ్ మెడిసిన్ నఫ్తాలిన్ బిళ్ళలు. ఈ బిళ్ళలు కప్ బోర్డులలో, సింక్ వాటర్ వెళ్లే దగ్గర పెడితే బొద్దింకల పెరుగుదల తగ్గిపోతుంది.
వీటితో పాటు వెనిగర్ లిక్విడ్ ను నీటిలో కలిపి మురుగు నీరు వెళ్లే రంద్రాలలో పోయడం ద్వారా బొద్దింకలు ఇంటిలోకి రావు. బేకింగ్ సోడాను చక్కెరను నీటిలో కలిపి చల్లడం ద్వారా కూడా బొద్దింకలను ఇంటిలోకి రాకుండా చేయవచ్చు. మరొక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మిరియాల పొడి, ఉల్లిగడ్డలను పేస్ట్ చేసి ఆ నీటిని బొద్దికలు వచ్చే ప్రదేశాల్లో చల్లితే ఘాటు వాసనకు బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశించవు.
బొద్దింకల నుంచి బయట పడాలంటే బిర్యానీ ఆకుని ఉపయోగించ వచ్చు. సాధారణంగా బిర్యానీ ఆకు వాసన ఘాటుగా ఉంటుంది. దీని వల్ల అవి తొలగి పోతాయి. ఘాటైన వాసనలు బొద్దింకలకు నచ్చవు. కాబట్టి ఎక్కువగా ఇంట్లో బొద్దింకలు సంచరించే ప్రదేశం లో వీటిని పెట్టండి లేదు అంటే ఎక్కడైనా బొద్దింకల గూడు కట్టేసిన అక్కడ ఒక వైపు పెట్టొచ్చు. ఈ వాసన వల్ల అవి పారిపోతాయి.
అలాగే కిచెన్‌లో వీలైనంత వరకు మనం తినే ఆహార పదార్థాలు కింద పడకుండా చూసుకోవాలి. లేదంటే.. బొద్దింకలు వచ్చేస్తాయి. అలాగే కిచెన్ లో పాత్రల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.