జగద్గురు శంకరాచార్యుల వారి జన్మస్థలంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. ఈ ప్రాంతంలో ఆయనకు ఒక అధ్భూతమైన ఆలయాన్ని నిర్మించారు. మరి ఈ ఆలయంలో మరకత శివలింగాన్ని ఎవరు ప్రతిష్టించారు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం, ఎర్నాకులం నుండి 80 కి.మీ. దూరంలో అంగమాలి నుండి కాలాడికి బస్సు సౌకర్యం ఉన్నది. ఈ కాలడిలో జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి దేవాలయం కలదు. పెరియార్ నది తీరమున ఈ ఆలయం ఉన్నది. అనేకమంది పండితులు శాస్రియంగా పరిశీలించి శంకరాచార్యుల జన్మస్థలం ఇదేనని నిర్దారించారు. జగద్గురు శంకరాచార్యుల వారి పవిత్ర జన్మస్తలం ఇది. ఇక్కడ ఆయనకు ఒక అధ్బుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఇచట శంకరులవారి మాతృమూర్తి అయినా ఆర్యాంబ సమాధి ఉన్నది. అక్కడే శిలా నిర్మితమైన నల్లరాతి దీపస్థంభం ఒకటి ఉంది. ఈ దీప స్తంభం ఉన్న ప్రదేశమే శంకరుల వారి జన్మించిన స్థలం అని చెప్తారు. అయితే పూర్వం ఆ ప్రాంతంలోనే ఒక చిన్న కుటీరం ఉన్నదని తెలుస్తుంది. ఆర్యాంబ సమాధికి ఒకవైపు శంకరాచార్యుని ఆలయం, రెండవ వైపున శారదాదేవి మందిరములు ఉన్నవి. ఈ ఆలయానికి ముందుభాగాన మరకత శివలింగం ఒకటి ప్రతిష్టించబడి ఉంది. దీనిని మైసూరు మహారాజ జయరామ రాజేంద్రవడయార్ గారు ప్రతిష్టించారు. ఈ శివలింగం వద్ద కన్నడ అర్చకులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విడవకుండా అభిషేకాలు జరుపుచుందురు. ఈ ఆలయంలోని గోడలయందు శంకరులవారి జీవిత విశేషాలను తెలియచేయు చిత్రాలు ముద్రించి ఉన్నాయి. ఇక్కడ శ్రీ శారదాదేవి ఆలయం, రామకృష్ణమఠం భక్తులకు దర్శనమిస్తాయి. అయితే శ్రీ శారదాదేవి ఆలయంలోని గోడలపైన ఇంద్రాణి, చాముండి, వారాహి వైష్ణవి, మానేశ్వరి దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈవిధంగా మరకతలింగం ఉన్న జగద్గురు శంకరాచార్యుల వారి ఆలయానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుండి ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.