శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువ ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ వెలసిన స్వామి కొలిచిన వారికీ కొంగుబంగారమై భక్తులకు వరాలిస్తున్నాడు. మరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువై ఉన్న ఈ ఆలయం స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలో కొండపైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. అయితే సర్పాకారంగా, శేషాచల పర్వతాన్ని పోలిన బెల్లం రంగు కలిగిన పవిత్ర క్షేత్రం ఈ చేవెళ్ల వేంకటేశ్వరస్వామి ఆలయం. ఇక ఈ ఆలయం స్థల పురాణానికి వస్తే, క్రీ.శ. 1305 లో రంగదాసుడు అనే భక్తుడు ఈ క్షేత్రంలో ఒక చిన్నదేవాలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే కాలగర్భంలో రంగదాసుడు ఆలయం శిధిలమవ్వడంతో పశువులు మేపడానికి వచ్చిన కాపరులు ఈ ఆలయం స్థానంలో చిన్న చిన్న రాళ్లతో ఆలయాన్ని నిర్మించి, స్వామివార్ల దేవతా ప్రతిమల్ని ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇక ఆ తరువాత ఇది కూడా శిధిలమైందని చెబుతారు. ఇక కొంతకాలం తరువాత ఒక రైతు పొలం దున్నుతుండగా అతని నాగలికి వద్ద ఒక సున్నపు రాయి కనిపిచింది. దానిని నాగలి పైన పెట్టి పొలం గట్టు వద్ద నాగలి వదిలేసి మళ్ళీ మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ రాయి తిరిగి అది ఉన్న ప్రదేశంలో ఉండటం గమనించి దానిని మళ్ళీ నాగలి పైన పెట్టగ ఆ శిలా అయన ముందే దొర్లుతూ తిరిగి యథాస్థానానికి చేరింది. ఈ వింత గ్రామ ప్రజలందరికి చెప్పగా వారు కూడా శిలా దొర్లడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే విషయాన్ని గ్రామ పురోహితుడు అయినా తిరుపతి బట్టకు చెప్పగా ప్రాతః కాలంలోకి వెళ్లి ఆ శిలను దర్శించగా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై సాలగ్రామ శిలారూపంలో ఉన్న నన్ను ఈ చేవెళ్ల గుట్టపై ఇంతకు పూర్వం ఉన్న ఆలయంలోనే నన్ను ప్రతిష్ఠించుము నీకు ముక్తి లభిస్తుందని చెప్పి అంతర్దానయ్యాడు. అప్పుడు ఆ పురోహితుడు శిలను గుడిలో ప్రతిష్టించాడని స్థల పురాణం. ఇక ఈ అలయం విషయానికి వస్తే, ప్రధానాలయం ప్రాంగణంలో పంచలోహ నిర్మితమైన ధ్వజస్థంభం సుమారు 40 అడుగుల ఎత్తులో అరలారుతుంది. ఈ ద్వష్టసభం చుట్టూ ప్రదిక్షణల వలన స్వర్వ శుభాలు కలుగుతాయంటారు. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఒక పక్క అశ్వత్థవృక్షం దీని క్రింద నాగబందం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రక్క శివాలయం మరో ప్రక్క నవగ్రహ ఆలయాలు భక్తులకి దర్శనం ఇస్తాయి.
Home Unknown facts Sarpakaranga sheshachala parvathani polina bellam rangu pavithra kshetram ekkada?
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.