Shivudu shri palli kondeshwara swamiga endhuku avatharinchadu

0
5827

దేవతలకి మరియు రాక్షసులకు అమృతం కోసం జరిగే యుద్ధం లో శివుడు కాలకూట విషాన్ని సేవిస్తాడు. మరి ఆ విషయం సేవించక ఏం జరిగింది? ఇక్కడి ఆలయానికి దానికి సంబంధం ఏంటి? శివుడు శ్రీ పల్లి కొండేశ్వర స్వామిగా ఎందుకు పిలువబడుతున్నాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. dharmadevathaచిత్తూరు జిల్లాలోని తిరుపతికి 76 కి.మీ. దూరంలో నాగలాపురం మండలంలోని సురుతాపల్లిలో శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయం కలదు. dharmadevathaఇలా ఈ ఆలయ పురాణానికి వస్తే, అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలసి మందర పర్వతం, వాసుకి అనే సర్పం సహాయంతో పాలసముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషం వెలువడింది. అది పద్నాలుగు లోకాలని దహించడానికి సిద్దమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సుర, అసురులు పరమేశ్వరుడిని ప్రార్ధించగా, చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికీ అభయం ఇచ్చి ఆ కాలకూట విషాన్ని మింగేస్తాడు. ఆ హాలాహలం శివుని గర్భంలోకి పోనివ్వకుండా పార్వతీదేవి అడ్డుకోగా, ఆ విషం కంఠం వద్దే నిలిచిపోయి స్వామిని నీలకంఠుణ్ణి చేసింది. dharmadevathaవిష ప్రభావానికి గురైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విరమించాడని, శివుడు శయనించిన క్షేత్రం కనుక దీనిని శివ శయన క్షేత్రం అని అంటరాని స్కంద పురాణంలో చెప్పబడింది. అయితే మరమశివుడు హాలాహలం భక్షించి విశ్ర మించినందున దీనిని కాలకూటసన క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయంలో విషం మత్తులో పార్వతి ఒడిలో తల ఉంచి పవళించి ఉన్న శివమూర్తి విగ్రహం ఇక్కడ ఉంది. dharmadevathaశయనించి ఉండటం వలన ఇక్కడి శివుడ్ని పల్లి కొండేశ్వరుడు పళ్ళికొండ అంటే తమిళంలో పడుకొని ఉన్నాడని అర్ధం. కొంతమంది దీనిని వాల్మీకి క్షేత్రం అని కూడా అంటారు. భారతదేశంలోనే శివుని రూపకారములో పూజలందుకొనేది ఈ దేవాలయం నందు మాత్రమే అని చెబుతారు. dharmadevathaఈ దేవాలయం నందు దాంపత్య దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం చేసినచో భార్యాభర్తలు కలహాలు పోయి వారు సుఖీభవముగా గడుపుతారని ప్రతీతి. పెళ్లికాని వారు ఈ స్వామివారిని దర్శించిన పెళ్లి జరుగును అని ఇక్కడ భక్తుల నమ్మకం.
ఈవిదంగా పరమేశ్వరుడు ఈ ఆలయం నందు వెలసి భక్తుల పూజలను అందుకుంటున్నాడు.6 sri pallikondeswara swamy surutapalli