ఒక ఆలయాన్ని నిర్మించడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని వింటుంటాం. కానీ ఈ ఆలయాన్ని కట్టడానికి ఏకంగా 105 సంవత్సరాలు పట్టిందంటా. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రము, బెంగుళూరు నగరానికి 185 కి.మీ. దూరంలో హళేబీడు ఉంది. ప్రాచీన పాలకులైన హొయసలుల గొప్ప నగరం హళేబీడు. హళేబీడును పూర్వం ద్వారా సముద్రం అనేవారు. కన్నడ భాషలో ‘హాలే’ అంటే పాత అని అర్ధం. ‘బీడు’ అంటే పట్టణం అని అర్ధం. ప్రఖ్యాత అమర శిల్పి జక్కన్న కుమారుడు దక్కన చేత, అతి సున్నితమైన శిల్పాలు చెక్కబడిన హొయసలేశ్వరాలయం ఈ హళేబీడులో ఉంది. ఇది అతి గొప్ప శిల్పకళా నిలయంగా ప్రఖ్యాతి గాంచింది. వేల సంఖ్యలో శిల్పాలు చెక్కబడిన ఆలయ సమీపంలోని కెదేశ్వర దేవాలయాన్ని మొగుల్ చక్రవర్తుల సేనానిమాలిక్ కాఫర్ నాశనం చేసాడు. తరువాత ఈ ఆలయ పునరుద్ధణ విష్ణువర్దన చక్రవర్తి సేనాధిపతి కేతు మల్లుడు క్రీ.శ. 1121 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది పూర్తవ్వడానికి 105 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఈ ఆలయం బయటినుండి చూడటానికి ఒకటిగా కనిపించిన, లోపల విడి విడిగా రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకదానిలో శాంతాళేశ్వరుడు అనే పేరుతో, రెండవ దానిలో హొయసలేశ్వరుడు అనే పేరుతో రెండు శివలింగ మూర్తులు ఉన్నాయి. ఈ హళేబీడు ఆలయం ఆరడుగుల ఎత్తు ఉన్న విశాలమైన వేదిక మీద నిర్మించబడింది. ఆలయం మొత్తం అరవై నాలుగు కోణాలు కలిగి ఉన్నది. గోడల క్రిందిభాగాన, చుట్టూ వరుసలు, వరుసలుగా వివిధ రకాల జంతువుల ఆకారాలు చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో ఏ ఒక్క శిల్పం కూడా ఇదే గొప్పది అని చెప్పలేము, అన్ని చాలా అధ్బుతంగా ఉంటాయి. ఇక్కడ ఒక చోట శ్రీరాముడు ఒకే బాణంతో ఏడూ తాడి చెట్లను పడగొట్టడం, మరొక చోట తన తలపైగా విల్లు ఎక్కుపెట్టి ఉన్న అర్జునుని శిల్పం ఉంది. ఇంకా ఇక్కడ చిన్ని కృష్ణుడు అల్లరి పనులు చిపించే శిల్పం, ఇవేగాక కొన్ని విచిత్రమైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఇచట మ్యూజియంలో 56 రకాల గణపతి విగ్రహాలను మనం ఒకేసారి దర్శించుకోవచ్చు. ఇంతటి శిల్ప సంపద ఈ ఆలయం లో ఉన్నదీ కనుకే అన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.