హనుమంతుడికి గుడి లేని గ్రామం అనేది ఉండదు. ఇలా హనుమంతుడు భక్తులకి దర్శనం ఇచ్చే కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతారు. ఈ ఆలయం లో హనుమంతుడు సంజీవరాయస్వామిగా భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మరి ఇక్కడ వెలసిన ఆ స్వామికి సంజీవరాయస్వామి అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు 20 కి.మీ. దూరంలో రాజుపాలెం మండలం లోని కుందూనది ఒడ్డున వెల్లల అనే గ్రామంలో సంజీవరాయస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈ ఆలయంతో పాటుగా శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ భీమలింగేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలున్నాయి. ఇలా అనేక దేవాలయాలు ఉన్న ఇక్కడ శైవ, వైష్ణవ బేధాలు లేకుండా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే హనుమంతుడు సంజీవిని కోసం వెళుతూ ఈ ప్రాంతంలో ఆగి కుందూనది సమీపంలో ఒక గుండంలో స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసాడని స్థల పురాణం తెలియచేస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న గుండానికి హనుమంతుగుండం అని పేరు వచ్చింది. ఇలా సంజీవిని కోసం వెళుతూ ఇక్కడ ఆ స్వామి ఆగినారు కాబట్టి ఆయనని సంజీవరాయుడిగా భక్తులు కొలుస్తారు. అయితే స్వామి వారు స్నానం ఆచరించిన ఆ గుండం వద్ద ఇప్పటికి అయన పాదముద్రలు భక్తులకి దర్శనం ఇస్తాయి. ఇక ఆలయ విషయానికి వస్తే, ఆరు శతాబ్దాల క్రితం చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయస్వామిని గ్రామానికి దక్షిణదిక్కున పునః ప్రతిష్ట చేసారు. ఇక 15 వ శతాబ్దంలో హనుమదళ్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్టించారు. ఇలా ఈ ఆలయంలో కొలువై ఉన్న సంజీవరాయస్వామిని దర్శిస్తే గ్రహ దోషాలను తొలగిస్తాడని, దీర్ఘవ్యాధి బాధల నుండి దూరం చేస్తాడని, కోరిన కోర్కెలు తీరుస్తాడని అనేక దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.