దేవుడికి మనిషికి తేడా ఏంటో తెలుసా ?

0
4200

మన సృష్టికి మూలం దేవుడు. పురాణాల ప్రకారం మొత్తం నాలుగు యుగాలు, లోక కళ్యాణం కోసం ఒక్కో యుగంలో ఒక్కో దేవుడు అవతరిచాడని చెబుతారు. ప్రస్తుతం మనం ఉన్న యుగం కలియుగం. ఇక దేవుడి గురించి చెప్పే ఎన్నో పురాణ ఇతిహాసాలు, రామాయణ, మహాభారత కథలు మనకి ఉన్నాయి. మరి మనిషిని సృష్టించిన దేవుడికి మనిషి కి మధ్య వ్యత్యాసం ఏంటి? దేవుడికే శక్తులు ఉంటాయా? అసలు దేవుడు ఉన్నాడా అనే విషయాల గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం.

godపురాణాల ప్రకారం దేవుడి విషయానికి వస్తే, సమస్థకోటి దేవతలలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు. ఒక్కో దేవుడి గురించి ఎన్నో కథనాలు ఉండగా మనిషిని సృష్టించింది వీరే, ఇందులో బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీమహావిష్ణువు దుష్టులను అంతం చేయడానికి మొత్తం దశావతారాలను ఎత్తాడు. అందులో ఏడవ అవతారమే శ్రీ రామావతారం. దేవుడు మనిషి రూపంలో జన్మించిన మొదటి అవతారం ఇదేనని చెబుతారు. ఈ అవతారానికి ముఖ్య కారణం రాక్షసుడైన రావణుసురుడు సంహరించడం. ఇక ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడి లీలలు ఎన్ని చెప్పిన తక్కువే ఈ అవతారంలో కంసుడిని సంహరించడమే కాకుండా, మహాభారతంలో దుష్టులైన కౌరవులను అంతం చేయడానికి పాండవులు పక్షాన ఉంటూ కురుక్షేత్ర యుద్ధం జరిపించి వారిని నాశనం చేసాడు.

godఇలా ఒక్కో అవతారంలో ఒక్కో కారణం చేత భగవంతుడు జన్మించి లోక కళ్యాణం చేసాడు. ఇది ఇలా ఉంటె మనుషుల గురించి మాట్లాడుకుంటే, రోజు రోజుకి మనుషుల జీవన శైలిలో మార్పులు ఎన్నో వస్తున్నాయి. మన హిందూసాంప్రదాయంలో దేవుడు ఉన్నాడని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. అలానే దేవుడు లేదనే వాదన కూడా కొంత మందిలో ఉంది. ఒకవేళ దేవుడు లేడనే అనుకుందాం మరి మనిషి పుట్టుక ఆదిమానవుడి నుండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో అప్పటి ఆదిమానవుడి పుట్టకకి ప్రారంభం సైన్స్ అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. ఒకవేళ సైన్స్ ఏ ఉందని భావిస్తే సృష్టికి విరుద్ధంగా మనిషి చావు పుట్టుకలను ఎవరైనా నిర్ణయించగలరా అంటే దానికి సమాధానం అంటూ ఉండదు.

godఅందుకే మనిషి వెనుకాల ఒక శక్తి ఉంది అది దేవుడే నడిపిస్తున్నాడని చెబుతారు. ఇక నిజంగా దేవుడే ఉంటె మనుషులకి ఇన్ని కష్టాలు ఎందుకు అందరిని ఆనందంగా ఉండేలా చేయొచ్చుకదా అసలు దేవుడే లేడని వాదిస్తుంటారు చాలా మంది, అయితే కష్టాలు, సుఖాలు అనేవి మనుషుల మాత్రమే కాదు మన పురాణాల ప్రకారం దేవుళ్ళు కూడా అనుభవించారు. దేవుడు మనిషిగా జన్మించిన రామావతారంలో రాముడు, సీతాదేవి ఎన్నో కష్టాలు చూసారు. ఆ అవతారంలో వారు సంతోషంగా ఉన్నదాని కంటే కష్టాల్లో కన్నీళ్లతో గడిపిన రోజులే ఎక్కువని రామాయణం చెబుతుంది. మరి రాముడు దేవుడే కదా అయినా ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అంటే అది సృష్టి ధర్మం. కష్టాలు, సుఖాలతో ముడిపడి ఉండేదే జీవితం. మనిషి తన సుఖం కంటే ఎక్కువగా కష్టాలనే తలచుకొని జీవిస్తాడు అందుకే ఉన్న సంతోషాన్ని కూడా మరిచిపోవడం వల్ల వారి జీవితంలో అన్ని కష్టాలే అన్నట్లుగా కనిపిస్తాయి.

godమన దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ప్రాచీన ఆలయం వెనుక ఒక పురాణం అనేది ఉంది. అసలు దేవాలయం వెళ్లడం ఎందుకు దేవుడిని ఎందుకు పూజించాలి అంటే, మనం మనకి బాగా నచ్చిన వ్యక్తి పుట్టిన రోజు ఏదైనా కనుక ఇవ్వడం అలవాటు అదేవిధంగా దేవుడు అంటే అమితమైన భక్తి వలన వెలసినవే దేవాలయాలు. దేవుడి గుడిలో దర్శనం అనేది అటు శాస్రియంగా ఇటు సైటిఫిక్ గా మనిషకి లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదు. అంటే దేవుడి పూజిస్తే మనకి లాభం తప్ప నష్టం అనేది లేదు. గుడికి వెళ్లి దేవుడిని మనస్ఫూర్తిగా దర్శించుకోవడం వలన మనశాంతి తో పాటు చాలా మానసిక దైర్యం వస్తుంది.

godదేవుళ్ళ కాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు, ప్రస్తుతం కలియుగంలో మనుషుల్లోనే దేవుళ్ళు, రాక్షసులు అనేవారు ఉన్నారు. ఇలా ఈ కాలంలో చెడి చేస్తూ మనుషులను ఇబ్బందిపెట్టేవాలన్నీ సంహరించడం కోసం దేవుడు ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి వారిని సంహరిస్తాడు. అందుకే కలియుయాగంలో దేవుడు మనిషి రూపంలో ఉంటాడు. ఒకరికి చెడు చేయకుండా ఎలాంటి స్వార్థం లేకుండా చెడుని అంతం చేసే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. మన కంటికి కనిపించని మనలో ఉండే నమ్మకమే దేవుడు.

god