ఈ ఆలయంలో శివలింగాన్ని కదిలించడం వెనుక గల కారణం ఏంటో తెలుసా ?

0
4468

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో వెలసిన ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత అనేది ఉంది. అయితే ఈ ఆలయంలోని లింగానికి కూడా ఒక విశేషం అనేది ఉంది. అది ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని కదిలిస్తే కదులుతుంది. మరి ఆ శివలింగం ఎక్కడ ఉంది? అలా శివలింగాన్ని కదిలించడం వెనుక గల కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 kadilisthe kadile shivalingamఆదిలాబాద్‌ జిల్లాలోని బేలమండలంలో సదల్‌పూర్‌ అనే గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో భైరందేవ్, మహాదేవ్‌ అనే ఆలయాలు ఉన్నాయి. భైరందేవ్‌ ఆలయంలో ఆదివాసీల దేవతామూర్తులు, మహదేవ్‌ ఆలయంలో శివలింగం ఉంటుంది. ఈ రెండు ఆలయాలను శాతవాహనులు నిర్మించారు. ఇవి పూర్తిగా నల్లరాతితో నిర్మించి శాతవాహనుల కళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. ఇప్పటికి అందమైన శిల్పాలు చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తాయి.

2 kadilisthe kadile shivalingamఅటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయాలు ఎంతో ప్రాచీనం కలిగినవి. ఏటా పుష్యమాసంలో బైరందేవ్‌ పక్కనే ఉన్న మహదేవ్‌ ఆలయాల్లో జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నిర్వహించే జాతరను జంగి జాతరగా పిలుచుకుంటారు. మండలంలోనే అతిపురాతన ఆలయాలుగా ఇవి నిలిచిపోయాయి.

3 kadilisthe kadile shivalingamప్రతి ఏటా పుష్యమాసం నవమి రోజున ప్రత్యేక అభిషేకాల ద్వారా జాతర ప్రారంభమవుతుంది. ఈ ఆలయాల్లో కొరంగే వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తారు. వారంరోజుల పాటు కొనసాగి అమావాస్య రోజున కాలదహి హండి అనే కార్యక్రమం నిర్వహించి జాతర ముగిస్తారు.

3 kadilisthe kadile shivalingamఅయితే కాలదహి హండికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కుండలో పెరుగు వేసి, ఆలయం పైభాగంలో జెండా ఎగురవేస్తారు. అనంతరం ఆ కుండను పగలగొట్టి అందులోని పెరుగును కింద అప్పటికే ఉంచిన పాలు, కుడుకలు, అటుకులతో ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా ఏర్పాటుచేస్తారు. ఇలా పెరుగుతో కలిసిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు ఇవ్వకుండా ఆలయంపై నుంచి విసిరి వేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఆత్రుతగా అందుకుంటారు. ఈ జాతర 48 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. గత 24 ఏళ్ల నుంచి జాతర ముగింపు రోజు దర్బార్‌ నిర్వహిస్తున్నారు.

4 kadilisthe kadile shivalingamఇక అసలు విషయంలోకి వెళితే, మనసులో ఏదైనా కోరుకుని ఈ ఆలయంలోని లింగాన్ని పైకి ఎత్తాలి. ఒకవేళ కనుక ఆ కోరిక తీరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని, లేదంటే ఆ శివలింగం కదలకుండా అలానే ఉంటుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయాల్లోని దేవతామూర్తులు ఆదివాసీల ఆరాధ్య దైవం అయినప్పటికి ఆదివాసీలే కాకుండా అన్ని ప్రాంతాల భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

5 kadilisthe kadile shivalingamఈవిధంగా ఈ ఆలయంలోని శివలింగాన్ని మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అని లింగాన్ని కదిలించి ఒకవేళ కదిలితే వారి కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు తిరిగి వెళుతుంటారు.

7 kadilisthe kadile shivalingam