ఈ ఆలయాన్ని దర్శించిన వారికీ పునర్జన్మ అనేది లేకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం

0
11697

ఈ ఆలయాన్ని సూర్యస్తసమయం లోపు దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోయి, పునర్జన్మ అనేది ఉండదని ఇక్కడ భక్త్జుల గట్టి నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆ స్వామివారు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

aalayamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో వంగర మండలం లో సంగా గ్రామం కలదు. ఇచట అతి పురాతనమైన శ్రీ సంగమేశ్వరాలయం ఉన్నది. ఇది నాగావళి, స్వర్ణముఖి, వేదవతి నదులు సంగమించే పవిత్ర ప్రదేశం. కాబట్టి దీనికి సంగాం అనే పేరు వచ్చింది.

aalayamపరశురాముడు మహాభారత యుద్ధం అనంతరం పంచలింగ క్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు. అయితే బలరాముడు ప్రతిష్టించిన ఐదు శివలింగాలను మహాశివరాత్రి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోగ దర్శించిన వారికి పాపాలన్నీ పోవడమే కాకా, వారికీ పునర్జన్మ అనేది లేకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం.

aalayamఇక స్థలపురాణానికి వస్తే, ద్వారపరయుగంలో ప్రజలు కరువుకాటకంతో ఈ ప్రాంతంలో అలమటిస్తునప్పుడు బలరాముడు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండగా, ప్రజల కష్టాలను చూచి, భూమిలో నాగలిని గట్టిగ పెట్టి ఒరిస్సా నుండి శ్రీకాకుళం జిల్లా కళ్లేపల్లి వరకు గంగను తీసుకువచ్చాడని, అలా నాగలితో వచ్చిన గంగను నాగావళి అని పేరు వచ్చిందని, అయితే గంగను నాగలితో బంధించి బలరాముడు తెచ్చినందుకు గాను ఆ పాప ప్రక్షాళనకు ఈ నాగావళి నదీతీరంలో ఐదు శివలింగాలను ప్రతిష్టించినట్లు స్థలం పురాణం చెబుతుంది.

aalayamఈ ఐదు శివలింగాలు ప్రతిష్టించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. వీటిలో రెండు క్షేత్రాలు ఒరిస్సా రాష్ట్రంలోని పాయపాడులోను, మరొకటి విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గరలోని గుంపక్షేత్రం కాగా, మిగిలిన మూడు క్షేత్రాలు వంగర మండలంలోని ఈ సంగాం సంగమేశ్వరునిగా, శ్రీకాకుళం పట్టణంలోని ఉమా రుద్ర కోటేశ్వరునిగా, కళ్లేపల్లి వద్ద మణినాగేశ్వరాస్వామి పేరుతో ఈ క్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి.

aalayam
ఈ సంగాం క్షేత్రంలో శివుడు సంగమేశ్వరుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఈ స్వామివారికి మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అప్పుడు వేలమంది భక్తులు ఈ సంగమస్థానంలో భక్తి శ్రద్దలతో స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తారు.