“కోట్లుని ధిక్కరించే వాడు కవి…
కొన్ని కోట్ల మంది కలలకి తన కలంతో దారి చూపేవాడు కవి…
ప్రపంచమంత మెదడు చచ్చిన మెషిన్లు అయ్యి పాలకుల సంకలు నాకుతుంటే…
రే! పోరంబొకు ఆడు నీకు టోపీ ఇస్తా అని చెప్పి నీ గోచి లాకెళ్తున్నాడు రా అని నీ నడ్డి మీద తన్నేవాడు కవి…
యెక్కడో చీకటి గదిలో, నువ్వు కుర్రో మర్రో అంటూ జీవితం గురించి భయపడుతుంటే…
భయంతో విరిగిపోయిన నీ వెనుముక్కని తన అక్షరాలతో అతికించి ప్రపంచం మీద దూకి పోరాడు రా అని ఉత్తేజ పరిచేవాడు కవి…
సన్నాయి మాటలు నీ చెవిలో ఊదేవాడు కవి కానే కాదు…
సల సల మండుతున్న నిప్పు లాంటి నిజాల్ని నీకు తెలియచేసేవాడే కవి…
నీలోని మనిషిని నీకే తెలిచేసేవాడు కవి
కవులు చెప్పే మాటలు గాని ఈ ప్రపంచం శ్రద్దగా విని వుంటే ఈ ప్రపంచం యెప్పుదో అందంగా
మారిపొయ్యి ఉండేది.”
నా జీవితం యెప్పుడు అలిసిన నేను ఈ పాట వింటాను, ఈ పాటలోని ప్రతి అక్షరం అక్కడ యెక్కడో దారి తేలిక తప్పి పోయిన నా ఆత్మని మళ్ళీ నా దగ్గరకి చేరుస్తుంది.
“జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలో కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది”
ఈ పాటని సిరివెన్నెల గారు చక్రం సినిమా కోసం రాయలేదు. సిరివెన్నెల గారు సినిమాలలోకి రాకముందరే ఈ పాటని రాసి పెట్టుకున్నారు. యెందరో దర్శకులు ఈ పాటని సినిమా కోసం అడిగారు కానీ సిరివెన్నెల గారు ఇవ్వలేదు, మొత్తానికి కృష్ణ వంశీ గారు ఈ పాటని చక్రం సినిమా కోసం సాధించారు.
“సినిమా కోసం ఈ పాట కాదు, పాట కోసమే సినిమా”
ఈ కింద వీడియొలో సిరివెన్నెల గారు ఈ పాట గురించి ఇచ్చే వివరణ చూసిన ప్రతిసారి రోమాలు నిక్కపొడుచుకుంటై. ఇప్పటికీ యెన్నో సార్లు చూశాను ఈ వీడియొ కానీ ప్రతి సారి ఒక మధుర అనుభూతి కలుగుతుంది. యెందుకో తెలీదు ఇవాళ మళ్ళీ ఒకసారి ఈ వీడియొ చూసా, మీతో పంచుకోవాలి అనిపించింది, మీరు కూడా చూసి మరో ప్రపంచంలోకి దూకండి
ఈ పాట నాకేనే, లేక మీకు కూడా మీ జీవితంలో ఈ పాటకి పెద్ద పాత్రే ఉందా!!!