ఇక్కడ ఉన్న ఆలయంలో విశేషం ఏంటంటే దేవాలయం చుట్టూ కూడా ఎపుడు నీరు ఊరుతూ ఉంటుంది. అయితే ఈ ఆలయంలోని నీరు రంగు మారితే అది ఆ ప్రాంతం అంతం అవుతుంది అని చెబుతన్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం లో రంగు ఎందుకు మారుతుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ నుండి సుమారు 40 కీ.మీ. దూరంలో తుళుము అనే ప్రాంతంలో ఖీర్ భవాని అమ్మవారి దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. జమ్మూ – కాశ్మీర్ లో వేంచేసి ఉన్న ఈ భవానీమాత కాశ్మీర్ హిందువుల ఆరాధ్య దేవత.
ఈ ఆలయం మార్బుల్స్ తో నిర్మించబడి ఉంది. ఇంకా చినారు అనబడే చెట్ల మధ్యలో ఈ ఆలయం ఉంది. అయితే ఈ దేవాలయం చుట్టూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గుడిలో నీటి ఊటలు కలవు. ఇక్కడ ఉన్న నీటి ఊటలలోని నీరు రాత్రి సమయాలలో రంగులు మారుతుంటాయి. తుళుము అనే పదానికి సంస్కృతంలో వెలగట్టలేని విలువైన ప్రదేశం అని అర్థం.
ఈ గ్రామంలో ఉన్న ఓ కుండం వల్లే ఆ పేరు వచ్చింది. ఆ కుండం సాక్షాత్తూ అమ్మవారి స్వరూపం అని భక్తులు విశ్వాసం. అందుకనే ఆ కుండంలో పాలు, బియ్యంతో చేసే పరమాన్నాన్ని నివేదించడం ఆచారంగా వస్తుండేది. భక్తులు విచ్చలవిడిగా వేసే పరమాన్నంతో కుండంలోని జలం కలుషితం కావడంతో, ఇప్పుడు తమ ప్రసాదాలని కుండం మధ్యలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి నివేదిస్తున్నారు. ఇంతకీ ఆ కుండం మధ్యలో నెలకొల్పిన అమ్మవారి గురించి కూడా ఓ గాథ ప్రచారంలో ఉంది.
పురాణానికి వస్తే, రాములవారు అరణ్యవాసం చేసే సందర్భంలో అమ్మవారిని కొలుచుకునేవారట. అరణ్యవాసం పూర్తయిన తర్వాత తను కొలుచుకునే అమ్మవారి విగ్రహాన్ని ఉత్తరాదికి తరలించమంటూ ఆంజనేయుని కోరారట. అలా అమ్మవారి విగ్రహాన్ని కశ్మీర్లోని షాదీపోరా అనే గ్రామంలో ప్రతిష్టించాడట ఆంజనేయుడు. ఆ తరువాత అమ్మవారు ఆలయపూజారి కలలో కనపడి, తనను తుల్ముల్ గ్రామంలోని కుండం మధ్యలో ప్రతిష్టించమని కోరడంతో ప్రస్తుతానికి ఆమె నివాసం తుల్ముల్లో స్థిరమైంది. అలా ఒక పక్క అమ్మవారుగా భావించుకునే కుండమూ, ఆ కుండం మధ్యలో సాక్షాత్తూ అమ్మవారి రూపమూ భక్తులకు కన్నులపండుగగా తోస్తాయి.
ఇప్పటికీ ఏటా జ్యేష్ఠ శుద్ధ అష్టమినాడు అమ్మవారికి జరిగే ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో ఉన్న కశ్మీరీపండితులంతా తుల్ముల్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి కుండానికీ, ఆ కుండం మధ్యలో ఉన్న అమ్మవారికీ తమ బాధలు చెప్పుకొంటారు. ఆ రోజున ఈ కుండంలోని నీరు రంగు మారుతుందని చెబుతారు. ఒకవేళ కుండంలోని నీరు నల్లటి నలుపులో కనిపిస్తే మాత్రం కశ్మీరులో అరిష్టం తప్పదని నమ్ముతారు. 1990లో ఆ కుండంలోని నీరు నల్లటి నలుపు రంగులోకి మారిందట. అప్పటినుంచే కశ్మీర్ పండిట్లకు కష్టాలు మొదలయ్యాయని చెబుతుంటారు.
ఈవిధంగా ప్రతి సంవత్సరం కుండంలోని నీరు ఒకవేళ కనుక ఆ రోజు నల్లగా మారితే అరిష్టం తప్పదని స్థానిక భక్తుల నమ్మకం.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.