గబ్బిలాలను పూజించే గ్రామం!!! ఎక్కడో చైనాలో లేదు మన తెలుగు రాష్ట్రాల్లోనే…!

గబ్బిలాల వలనే చైనాలో కరోనా వైరస్ వ్యాపించిందనే వార్త చాలా రోజుల నుండి ప్రచారంలో ఉంది. మనం గబ్బిలాలను చూస్తే ఆమడ దూరం వాటిని తరుముతాము. గబ్బిలాలు వివిధ రకాల వ్యాధులకు కారణమని భావించి వాటిని మన ఇంటి చుట్టూ తిరగనివ్వం.
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో మాత్రం గబ్బిలాలను దైవ సమానంగా భావించి గబ్బిలాలు ఉన్నటువంటి చెట్టుకు పూజలు చేస్తున్నారు. కేవలం ఆ గ్రామంలోని ప్రజలు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని గబ్బిలాలు ఉన్నటువంటి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ విధంగా గబ్బిలాలు ఉన్న చెట్టుకు పూజలు చేయడం ఏమిటి? పూజలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా,రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మర్రి చెట్టు పై వందలాది గబ్బిలాలు నివసిస్తుంటాయి. ఈ విధంగా గబ్బిలాలు వాలిన ఈ చెట్టుకు ఆ గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఈ చెట్టుకు పూజలు నిర్వహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఒకప్పుడు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలు సంభవించడమే కాకుండా, ఈ గ్రామంలో ముఠా కక్షలు పెద్ద ఎత్తున ఉండేవి. ఇలాంటి సమయంలోనే ఈ గ్రామంలోకి ఒకరోజు వందలాది గబ్బిలాలు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు పైకి వచ్చాయి.
ఈ విధంగా ఊరి చివర ఉన్న ఈ గబ్బిలాలు క్రమక్రమంగా ఊరిలో ఉన్న కొన్ని చెట్లపై వాలేవి. ఈ విధంగా గబ్బిలాలు ఊరులోకి ప్రవేశించిన తర్వాత ఊరిలో కరువు తొలగిపోవడమే కాకుండా, ఊరిలో ముఠా కక్షలు పూర్తిగా తగ్గిపోయాయి. అదేవిధంగా పంట పొలాలతో బాగా అభివృద్ధి చెందడంతో గ్రామస్తులందరూ గబ్బిలాలు ఊరిలోకి రావటం వల్లే వారి గ్రామం సుభిక్షంగా ఉందని భావించినప్పటి నుంచి ఆ మర్రి చెట్టుకు పూజలు చేయడం ప్రారంభించారు.
అదేవిధంగా ఆ గ్రామంలోని ఎవరికైనా చిన్నపిల్లలకు పక్షిదోషాలు ఉండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే చిన్నపిల్లలను ఆ చెట్టు వద్దకు తీసుకెళ్లి పూజలు చేయించడం, గబ్బిలాలు ఎముకలను పిల్లల మెడలో కట్టడంవల్ల పిల్లలకు పక్షులు దోషాలు తొలగిపోయి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని విశ్వసిస్తారు.
ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామానికి చేరుకుని ఈ చెట్టుకు పూజలు చేస్తారు. అయితే ఇన్ని రోజుల నుంచి గబ్బిలాలు అదే ఊరిలో ఉంటున్నప్పటికీ వాటి వల్ల ఏ ఒక్కరికి కూడా నష్టం కలిగించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR